Elon Musk: ఎలన్‌ మస్క్‌ కామెంట్లు.. మీడియా సాక్షిగా బైడెన్‌ చురకలు

Joe Biden Reacts On Elon Musk America Economy Comments - Sakshi

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌.. ప్రపంచంలోనే అత్యంత ధనికుడు ఎలన్‌ మస్క్‌కు చురకలు అంటించారు. తాను ఎప్పటికీ బైడెన్‌ అభిమానిని కాదంటూ ప్రకటించుకున్న ఎలన్‌ మస్క్‌.. తాజాగా చేసిన కొన్ని వ్యాఖ్యలు రాయిటర్స్‌లో పబ్లిష్‌ అయ్యాయి. శుక్రవారం మీడియాతో ముఖాముఖి సందర్భంగా బైడెన్‌కు సదరు వ్యాఖ్యలపై ప్రశ్న ఎదురైంది. దీంతో ఆయన ఆసక్తికరంగా స్పందించారు.

అమెరికా ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా ఉందంటూ (Super Bad Feeling) టెస్లా ఎగ్జిక్యూటివ్స్‌ వ్యాఖ్యలు చేశాడు(మెయిల్‌ ద్వారా) ఆ కంపెనీ సీఈవో ఎలన్‌ మస్క్‌. అంతేకాదు.. పది శాతం ఉద్యోగులను తగ్గించే యోచనలో ఉన్నట్లు కూడా ప్రకటించాడు. ‘ప్రపంచవ్యాప్తంగా ఉద్యోగ నియామకాలు నిలిపివేయండి’ అంటూ మెయిల్‌ చేశాడు మస్క్‌. ఈ వ్యవహారమంతా రాయిటర్స్‌లో ప్రచురితమైంది.

అయితే మస్క్‌ ఉద్దేశాన్ని జో బైడెన్‌ ముందు ప్రస్తావించింది మీడియా. దానికి బదులుగా..  ‘‘ఎలన్‌ మస్క్‌ ఇలా మాట్లాడే సమయంలో.. ఫోర్డ్‌ కంపెనీ తమ పెట్టుబడులను గణనీయంగా పెంచుకుంటూ పోతోంది’’ అంటూ పంచ్‌ వేశాడాయన. అంతేకాదు జేబులోంచి ఓ కార్డును బయటికి తీసి.. కొన్ని కంపెనీలు ఏమేర ఉద్యోగ నియామకాలు చేపట్టాయి..

ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టాయనేది స్వయంగా బైడెన్‌ చదివి వినిపించారు కూడా. చివర్లో కార్డును మళ్లీ జేబులో పెట్టుకుంటూ.. ‘‘కాబట్టి, అతనికి(మస్క్‌)కు మూన్‌ ట్రిప్‌ అయినా అదృష్టాన్ని తెచ్చిపెట్టాలంటూ’’ సెటైర్‌ సంధించారు బైడెన్‌. 

ఇక బైడెన్‌ సలహాపై ఎలన్‌ మస్క్‌ సైతం స్పందించాడు. థ్యాంక్స్‌ మిస్టర్‌ ప్రెసిడెంట్‌ అంటూ.. నాసా తదుపరి మూన్‌ మిషన్‌కు స్పేస్‌ఎక్స్‌ కంపెనీని ఎంచుకోవడంతో ఉన్న కథనాన్ని ప్రచురించాడు. 

ఇదిలా ఉంటే.. కేవలం మస్క్‌ మాత్రమే అమెరికా ఆర్థిక స్థితి గురించి ఆందోళన వ్యక్తం చేయడం లేదు. ప్రముఖ పెట్టుబడిదారు మైకేల్‌ బర్రీ, గోల్డ్‌మాన్‌ సాష్‌కు చెందిన ల్లాయిడ్‌ బ్లాంక్‌ఫెయిన్‌, సోరోస్‌ ఫండ్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో డాన్‌ ఫిట్జ్‌ప్యాట్రిక్‌, జేపీమోర్గాన్‌ సీఈవో జేమీ డిమోన్‌ లాంటి వాళ్లు సైతం రాబోయే రోజుల్లో అమెరికా భయంకరమైన సంక్షోభాన్ని ఎదుర్కొనుందంటూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top