Hong Kong: జిమ్మీలాయ్‌కి 14 నెలల జైలు 

Jimmy Lai Sentenced To 14 months Jail In Hong Kong - Sakshi

హాంకాంగ్‌: హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూలవాదులపై చైనా ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. స్థానిక మీడియా అధిపతి, ప్రజాస్వామ్య అనుకూలవాది అయిన జిమ్మీ లాయ్‌(73)కి హాంకాంగ్‌ న్యాయస్థానం శుక్రవారం మరో 14 నెలల జైలు శిక్ష విధించింది. 2019లో అనుమతి లేకుండా ర్యాలీలు చేపట్టారన్న నేరంపై ఇప్పటికే ఆయన జైలులో ఉన్నారు.

2019 ఆందోళనల సమయంలోనే అనధికారికంగా గుమికూడారన్న మరో కేసులో లాయ్‌తోపాటు 10 మందికి న్యాయస్థానం తాజాగా జైలు శిక్షలు విధించింది. కాగా, లాయ్‌ రెండింటికీ కలిపి 20 నెలలపాటు కటకటాల్లోనే గడపాల్సి ఉంటుంది. ది యాపిల్‌ డైలీ వ్యవస్థాపకుడైన జిమ్మీలాయ్‌ చైనా ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త జాతీయ భద్రత విధానం ప్రజాస్వామ్య హక్కులకు తీవ్ర విఘాతం కలిగించేదిగా ఉందని విమర్శిస్తున్నారు.
చదవండి: కరోనా: జాన్సన్‌ సింగిల్‌ షాట్‌కు యూకే ఓకే  

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top