Japan Company Sued For Rs 4 Crore After Boy Licks Soy Sauce Bottle, Video Goes Viral - Sakshi
Sakshi News home page

సాస్‌ బాటిల్‌ నాకిన బాలుడు.. కోట్లలో నష్టం, లబోదిబోమంటున్న కంపెనీ!

Jun 12 2023 12:21 PM | Updated on Jun 12 2023 1:24 PM

Japan Company Sued For Rs 4 Crore After Boy Licks Soy Sauce Bottle Goes Viral - Sakshi

టోక్యో :  పిల్లల్ని బయటకు తీసుకెళ్తే వాళ్లు చేసే అల్లరి మామూలుగా ఉండదన్న సంగతి తెలిసిందే. అందుకే తల్లిదండ్రులు పిల్లలతో షికారు అంటే తగు జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అలా లేదంటే ఒక్కోసారి మూల్యం భారీగానే చెల్లించుకోవాల్సి ఉంటుంది.  ఇటీవల ఈ తరహా ఘటనే జపాన్‌లో చోటు చేసుకుంది. ఓ సంస్థ ఒక బాలుడి చేసిన పనికి తమకు నష్టం వాటిల్లిందని ఏకంగా రూ.4 కోట్లు జరిమానా చెల్లించాలని కోర్టులో దావా వేసింది. అసలేం అక్కడ ఏం జరిగిందంటే.. 

వివరాల్లోకి వెళితే.. ఒసాకా జిల్లా కోర్టులో దాఖలైన వ్యాజ్యం ప్రకారం, ఓ విద్యా‍ర్థి జనవరి 3న స్నేహితుడితో కలిసి గిఫు ప్రిఫెక్చర్‌లోని సుషిరో అవుట్‌లెట్‌ను సందర్శించాడు. రెస్టారెంట్‌లో ఉన్నప్పుడు, సుషిరో కంపెనీకి చెందిన ఉత్పత్తులు తయారైన తర్వాత కన్వేయర్‌ బెల్టుపై వెళ్తుండగా, అతను తన వేలిని చీకి కన్వేయర్‌ బెల్టుపై ఉన్న ఒక ప్లేట్‌ను తాకాడు. అంతటితో ఆగకుండా సోయాసాస్‌ బాటిల్‌, కప్‌ను నాకాడు. ఇదంతా అక్కడ అమర్చిన సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యింది.

(చదవండి: ‘కూతురిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం.. పరువును బజారుకీడ్చొద్దు’)

విద్యార్థి అపరిశుభ్ర ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో షేర్‌ కావడంతో అది కాస్త వైరల్‌గా మారింది. దీని తర్వాత జపాన్‌లోని సుహీరో రెస్టారెంట్లు కస్టమర్ల సంఖ్య భారీగా తగ్గినట్లు తెలిపారు. సుషీ చైన్ సూట్ కూడా ఈ సంఘటన తన మాతృ సంస్థ కేవలం రెండు రోజుల్లో మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 16 బిలియన్ యెన్‌ల కంటే ఎక్కువ నష్టపోవడానికి కారణమైందని పేర్కొంది. దీంతో తమకు కలిగిన నష్టానికి నష్టపరిహారంగా 67 మిలియన్‌ యెన్‌లు (భారత కరెన్నీ ప్రకారం 4 కోట్ల రూపాయలు) చెల్లించాలంటూ బాలుడిపై ఆ సంస్థ దావా వేసింది. 

చదవండి: ‘ఆకలేస్తోంది.. అమ్మ చనిపోయింది!’.. వాళ్లను నవ్వించేందుకు రెస్క్యూ టీం ఏం చేసిందంటే..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement