సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు | Iran Strikes Israeli Spy Headquarters In Iraq As Regional Tensions Mount, See Details Inside - Sakshi
Sakshi News home page

Iran Attacks On Iraq Spy HQ: సిరియా, ఇరాక్‌పై ఇరాన్ క్షిపణి దాడులు

Published Tue, Jan 16 2024 7:41 AM | Last Updated on Tue, Jan 16 2024 10:44 AM

Iran Strikes Israeli Spy Headquarters In Iraq As Regional Tensions Mount - Sakshi

టెహ్రరాన్: సిరియా, ఇరాక్‌ ప్రాంతాలపై ఇరాన్ దాడులకు తెగబడింది. సిరియా, ఇరాక్ ఆధీనంలోని స్వయంప్రతిపత్తి కలిగిన కుర్దిస్థాన్‌ ప్రాంతంలో ఉగ్రవాదులను లక్ష‍్యంగా చేసుకుని క్షిపణి దాడులు జరిపింది. ఇజ్రాయెల్ గూఢచార బృందాల సమావేశంపై దాడి జరిపినట్లు ఇరాన్ పేర్కొంది. ఈ దాడుల్లో ఉగ్రవాదుల ప్రధాన కార్యాలయం ధ్వంసమైనట్లు ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ గ్రూప్స్ తెలిపింది. ఇందులో నలుగురు పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వెల్లడించాయి. మరో ఆరుగురు తీవ్ర గాయాలపాలైనట్లు పేర్కొన్నాయి. 

మరణించిన పలువురు పౌరుల్లో ప్రముఖ వ్యాపారవేత్త పెష్రా డిజాయీ కూడా ఉన్నారని కుర్దిస్థాన్ డెమోక్రటిక్ పార్టీ తెలిపింది. బాలిస్టిక్ క్షిపణులతో సిరియాలోని పలు ప్రాంతాలపై కూడా ఇరాన్  దాడులు చేసింది. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్స్ కమాండర్లకు చెందిన స్థలాలను లక్ష‍్యంగా చేసుకుని దాడులు జరిగాయి. ఇరాన్‌లోని కెర్మాన్, రాస్క్‌లలో ఇటీవల ఉగ్రవాదులు దాడులు జరిపి పలువురు ఇరాన్ దేశస్థులను హతమార్చారు. ఆ దాడులకు ప్రతిస్పందనగా సిరియాపై ఇరాన్ క్షిపణులతో రెచ్చిపోయింది.

సిరియాకు చెందిన అలెప్పో గ్రామీణ ప్రాంతాల్లో పేలుళ్లు వినిపించాయి. మధ్యధరా సముద్రం వైపు నుంచి 4 క్షిపణులు వచ్చినట్లు సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్ రైట్స్ వార్ మానిటర్ తెలిపింది. సిరియా, ఇరాక్‌ ఆధీనంలోని కుర్దిస్థాన్‌ ప్రాంతంలో ఇజ్రాయెల్ గూఢచారి బృందాలు కార్యకలాపాలు సాగిస్తున్నట్లు ఇరాన్ ఆరోపిస్తోంది. గాజాపై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తున్న ఇరాన్ ఈ మేరకు దాడులు జరిపింది. 

ఇదీ చదవండి: పుతిన్‌, మోదీ కీలక చర్చలు.. రష్యాకు విషెస్‌ చెప్పిన ప్రధాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement