నకిలీ యాప్ డౌన్లోడ్ చేసి.. 4.4 కోట్లు కోల్పోయిన ఐఫోన్ యూజర్

iPhone User Lost 6 lakh Dollars From Scam Bitcoin App - Sakshi

ఎక్కువ శాతం యాపిల్ సెక్యూరిటీ చాలా కఠినంగా ఉంటుంది. అందుకే, దీనిని కొనుగోలుచేయడానికి ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారు. కానీ, కొన్ని సార్లు హ్యాకర్లు యాపిల్ యూజర్లను కూడా హ్యాక్ చేసి డబ్బు సంపాదిస్తారు. ఇప్పడు అలాంటి సంఘటన ఒకటి తాజాగా జరిగింది. ఆపిల్ సంస్థ తన ఐఓఎస్ యాప్ స్టోర్‌లో ఉన్న నకిలీ క్రిప్టోకరెన్సీ యాప్ ను తొలగించడంతో ఐఫోన్ వినియోగదారుడు 6,00,000 డాలర్లకు పైగా నష్టపోయాయడు. ఇది మన ఇండియా కరెన్సీలో దాదాపు రూ.4.4 కోట్లకు సమానం.

ఫిలిప్ క్రిస్టోడౌలౌ అనే వ్యక్తి తన దగ్గర ఉన్న 17.1 బిట్‌కాయిన్‌ల విలువను చెక్ చేయాలని అనుకున్నాడు. దీని కోసం ఐఫోన్ లో వాలెట్‌ను ఆక్సెస్ చేయడం కోసం అతను ఐఓఎస్ యాప్ స్టోర్‌లో అచ్చం ఒరిజినల్ యాప్ లాగానే ఉన్న ట్రెజర్ యాప్ ను డౌన్‌లోడ్ చేశాడు. ఈ యాప్ మోసగాళ్లు అమాయక ప్రజలను మోసం చేసి డబ్బును కొల్లగొట్టేవారు. ఈ యాప్ యూజర్ల రహస్య వివరాలను నమోదు చేయడానికి మోస పూరితంగా కనిపించేలా రూపొందించారు. అయితే, ఫిలిప్ క్రిస్టోడౌలౌ వెల్లడించిన వివరాల సహాయంతో హ్యాకర్లు 17.1 బిట్‌కాయిన్‌లను దొంగలించారు.

బిట్ కాయిన్ అనేది ఒక డిజిటల్ కరెన్సీ కావడంతో హ్యాకర్ల పని చాలా తేలిక అయ్యింది. ఆపిల్ సంస్థ ఐఓఎస్ యాప్ స్టోర్‌లో ఉన్న నకిలీ క్రిప్టోకరెన్సీ యాప్ ను తొలగించడంతో తన బిట్‌కాయిన్లు దొంగలించినట్లు క్రిస్టోడౌలౌ తర్వాత  తెలుసుకున్నాడు. దీని విలువ మన దేశంలో సుమారు రూ.4.4కోట్లు. మహమ్మారి కారణంగా నష్టపోయిన తన డ్రై-క్లీనింగ్ వ్యాపారాన్ని ప్రారంభించడానికి బిట్‌కాయిన్లు సహాయపడతాయని ఆశించాడు. కానీ ఇంతలో ఇలా జరిగింది. గూగుల్ ప్లే స్టోర్‌తో పోలిస్తే ఆపిల్ ఐఓఎస్ యాప్ స్టోర్‌ అత్యంత సురక్షితమైనదిగా పేరు ఉంది.

చదవండి:

వాళ్లందరికీ పన్ను మినహాయింపు: నిర్మలా సీతారామన్

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top