టెహ్రాన్: గ్లోబల్ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిలో మరోసారి తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కతర్ నుంచి చమురు లోడ్‌తో భారత్‌కు వస్తున్న భారీ ఎల్‌ఎన్‌జీ ట్యాంకర్ ఓడపై అనుమానాస్పద డ్రోన్ దాడి జరిగింది. ఈ వైమానిక దాడి కారణంగా ఓడ తీవ్రంగా దెబ్బతినడమే కాకుండా, దాని ఇంజిన్ రూమ్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగాయి.
ఎల్‌ఎన్‌జీసీ అల్ రేకయ్యాత్ అనే ఈ భారీ నౌక కతర్‌లోని రాస్ లఫ్ఫాన్ పోర్ట్ నుండి ఎన్‌ఎన్‌జీలోడ్‌తో గుజరాత్‌లోని దహేజ్ ఓడరేవు వైపు బయలుదేరింది. ఈ క్రమంలో జూలై 7న అరబ్ సాగరం, ఒమన్ అఖాతం కలిసే ప్రాంతం గుండా ప్రయాణిస్తుండగా మిసైల్ ఓడ ఎడమ భాగాన్ని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద సమయంలో ఓడలో మొత్తం 29 మంది సిబ్బంది ఉన్నారు. వీరిలో నలుగురు భారతీయ నావికులు కూడా ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు ధృవీకరించాయి. అయితే, ఈ భీకర దాడి జరిగినప్పటికీ ప్రాణనష్టం ఏమీ జరగకపోవడం, సముద్రంలో ఎలాంటి చమురు లేదా గ్యాస్ లీకేజీలు జరగలేదు. ప్రస్తుతం ఈ ఓడ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ భారత్ వైపు వస్తోందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ కమ్యూనికేషన్‌కు సమాచారం అందింది.


