వార్నింగ్‌ ఇచ్చినా హ్యాండ్‌ ఇచ్చిన భారత్‌.. పుతిన్‌ రెస్పాన్స్‌పై టెన్షన్‌!

India Abstains Despite Russia Suspended From UNGA - Sakshi

మాస్కో: ఉక్రెయిన్‌పై దాడి కారణంగా రష్యాకు ఊహించని షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే రష్యాపై పలు దేశాలు కఠిన ఆంక్షలు విధించాయి.  తాజాగా ప్రపంచ మానవ హక్కుల మండలి నుంచి రష్యాను సస్పెండ్ చేస్తూ 193 మంది సభ్యులతో కూడిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ గురువారం తీర్మానాన్ని ఆమోదించింది. సాధారణ అసెంబ్లీలో మొత్తం 193 సభ్యుల ఓటింగ్‌కుగానూ.. రష్యాను తొలగించాలంటూ 93 ఓట్లు వచ్చాయి. 24 వ్యతిరేక ఓట్లు రాగా.. 58 మంది ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు. 

అయితే, ఈ ఓటింగ్‌ వేళ భారత్‌ మరోసారి ఆచితూచి వ్యవహరించింది. ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. అయితే, ఓటింగ్‌కు ముందు భారత్‌తో రష్యా మాట్లాడింది. తమకు అనుకూలంగా ఉండాలని సూచించింది. అయిన్పటికీ ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ సందర్భంగా ఓటింగ్‌పై యూఎన్‌లో భారత శాశ‍్వత ప్రతినిధి టీఎస్‌ తిరుమూర్తి స్పందిస్తూ.. ఉక్రెయిన్ వివాదం ప్రారంభమైన నాటి నుంచి భారతదేశం శాంతి, చర్చలు, దౌత్యం కోసం నిలబడింది. రక్తం చిందించడం, అమాయకుల ప్రాణాలను తీసుకోవడం కారణంగా ఎలాంటి పరిష్కారం ఉండదని మేము నమ్ముతున్నాము. ఇండియా ఎప్పుడూ శాంతి పక్షమే ఉంటుంది. హింసను కోరుకోదని స్పష్టం చేశారు. 

రష్యాకు చైనా అనుకూలంగా ఓటు వేయగా.. బంగ్లాదేశ్‌, భూటాన్‌, బ్రెజిల్‌, ఈజిప్టు, ఇండోనేషియా, ఇరాక్‌, మలేషియా, మాల్దీవులు, నేపాల్‌, పాకిస్తాన్‌, ఖతార్‌, సౌదీ అరేబియా, సింగపూర్‌, సౌతాఫ్రికా, శ్రీలంక, యూఏఈ.. దూరంగా ఉన్నాయి. దీంతో రష్యా స్పందిస్తూ.. ఓటింగ్‌లో దూరంగా ఉన్న దేశాలకు వార్నింగ్‌ ఇచ్చింది. ఓటింగ్‌కు దూరంగా ఉండటం అంటే తమ శత్రుత్వాన్ని పెంచుకోవడమేనని పేర్కొంది. ఇది భవిష్యత్తులో దేశాల మధ్య ద్వైపాక్షిక ఒప్పందాలపై ప్రభావం చూపుతుందని హెచ్చరించింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top