ఎంత అందంగా ఉందో.. ఇదేం వింత: 48 మిలియన్ల వ్యూస్‌

This Incredible Video of A Snake Is Crazy Viral With 48 Million Views - Sakshi

సాధారణంగా పాము, కొండచిలువ, అనకొండ వంటి పేర్లు వినగానే మనకు తెలియకుండానే ఒంట్లోకి భయం ప్రవేశిస్తుంది. ఆ వెంటనే ముఖం అదోలా పెడతా. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న వీడియోని ఒకసారి చూస్తే.. మళ్లీ మళ్లీ వీక్షిస్తారు. ఇంత అందంగా ఉంది.. ఇదేలా సాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసే ఈ కొండచిలువ ఇంద్రధనసు మాదిరిగా పలు వర్ణాల్లో మెరిసిపోతుంది. టక్కున చూస్తే.. ఏదైనా డ్రెస్‌ ఏమో అనుకుంటారు. అంత అందంగా ఉంది. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరలవుతోంది. 

కాలీఫోర్నియాకు చెందిన రెప్‌టైల్‌ జూ ఫౌండర్‌ జే బ్రూవర్ వివిధ వర్ణాల్లో ఉన్న కొండచిలువకు సంబంధించిన వీడియోని షేర్‌ చేశాడు. ఇక ఈ కొండచిలువ లేత నెమలి పించం, బంగారు వర్ణం రంగుల్లో మెరిసిపోతు నెటిజనులను ఆకర్షిస్తుంది. దీన్ని చూసిన నెటిజనులు ఇంత అందమైన కలర్‌ కాంబీనేషనా.. వావ్‌ సూపర్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ వీడియోని 48 మిలియన్ల మందికిపైగా చూడగా.. 3.3 మిలియన్ల మంది లైక్‌ చేశారు. 

చదవండి: ప్రాణం కోసం విలవిల.. గట్టిగా చుట్టి మింగేసింది

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top