ప్రాణం కోసం విలవిల.. గట్టిగా చుట్టి మింగేసింది

Man Captured Python Eating Mouse In Indonesia - Sakshi

జకార్తా : ఎముకలను పిండి చేస్తున్న ఒత్తిడి. ఊపిరి ఆడని పరిస్థితి. కళ్లు మామూలుకంటే పెద్దవయ్యాయి. కొద్దిగా బయటకు పొడుచుకొచ్చాయి. నోరు తెరిచింది.. కీస్‌.. కీస్‌ అని అరిచింది. సహాయం కోసం అన్నట్లు చేతులు బార్లా చాచింది... ఓ కొండ చిలువ చుట్టలో నలిగి ప్రాణాల కోసం గిలగిల్లాడిన ఓ ఎలుక పరిస్థితి ఇది. కొద్దిరోజుల క్రితం ఇండోనేషియాకు చెందిన జుల్‌ జుల్‌ఫిక్రి తన పెంపుడు కొండచిలువకు బతికున్న ఎలుకను ఆహారంగా వేశాడు.

ఫొటో క్రెడిట్‌ (mediadrum world.com/@dzulfikri72)
వెంటనే కెమెరా తీసుకుని ఫొటోలు తీయటం మొదలుపెట్టాడు. కొండచిలువ.. ఎలుకను చుట్టి, మింగేస్తున్న దృశ్యాలను ఫొటోలు తీశాడు. దాదాపు 5 నిమిషాల ఈ బతుకుపోరాటాన్ని కెమెరాలో బంధించాడు. దీనిపై అతడు మాట్లాడుతూ.. ‘‘ఈ ఫొటోలు తీసినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉన్నా.. ఆఖరి క్షణాల్లో ఎలుక ప్రాణాలకోసం విలవిల్లాడటం చూస్తూ బాధేసింది’’ అని పేర్కొన్నాడు.

ఫొటో క్రెడిట్‌ (mediadrum world.com/@dzulfikri72)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top