కరెంటు కట్.. పాకిస్తాన్‌లో స్తంభించిన విద్యుత్ సరఫరా..

Grid Failure Cause Massive power outage In Pakistan - Sakshi

ఇస్లామాబాద్‌: పొరుగుదేశం పాకిస్తాన్‌లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా పలు నగరాల్లో సోమవారం ఉదయం 7:30 గంటల నుంచి కరెంటు సరఫరా ఆగిపోయింది. పాకిస్తాన్ మీడియా సంస్ధలు ఈ విషయాన్ని వెల్లడించిన తర్వాత ఆ దేశ విద్యుత్ శాఖ కూడా ట్వీట్ చేసింది.

నేషనల్ గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీ పడిపోవడం వల్లే విద్యుత్ సరఫరా స్తంభించినట్లు అధికారులు తెలిపారు. దాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇస్లామాబాద్‌లోని 117 గ్రిడ్ స్టేషన్లు సహా కరాచీ, పేషావర్, బలూచిస్తాన్‌లోని 22 జిల్లాలు విద్యత్ సరఫరా అంతరాయం కారణంగా తీవ్రంగా ప్రభావితమయ్యాయి.

2021లో కూడా పాకిస్తాన్‌లో ఇలాగే జరిగింది. సింధ్ రాష్ట్రంలోని విద్యుత్ కేంద్రంలో సాంకేతిక తప్పిదం కారణంగా ఫ్రీక్వెన్సీ 50 నుంచి సున్నాకు పడిపోయి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.  ఒక్కరోజు తర్వాత దీన్ని పునరుద్ధరించారు.
చదవండి: ఉక్రెయిన్‌కు ఆయుధాలిస్తే ప్రపంచ వినాశనమే.. రష్యా హెచ్చరిక

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top