
లపై పడి నొప్పితో గిలగిల్లాడసాగాడు. యజమాని పరిస్థితిని గమనించిన శాడీ...
వాషింగ్టన్ : మంచి మనసుతో మనం చేసే పని ఏదైనా వృధా కాదు! దాని ప్రతిఫలం వడ్డీతో సహా తిరిగొస్తుంది. బ్రియాన్ జీవితమే ఇందుకు ఉదాహరణ. ప్రతిఫలం ఆశించకుండా ఓ కుక్కను దత్తత తీసుకుని ప్రేమతో పెంచాడు. అందుకు ప్రతిఫలంగా కుక్క అతడిపై విశ్వాసం చూపింది. అతడి ప్రాణాలు కాపాడింది. వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన బ్రియాన్ మైయర్స్ అనే వ్యక్తి కొద్దినెలల క్రితం ‘రమపో బెర్గెన్ యానిమల్ రెప్యూజీ’ అనే జంతు సంరక్షణా కేంద్రం నుంచి శాడీ అనే జర్మన్ షెపర్డ్ జాతికి చెందిన కుక్కను దత్తత తీసుకున్నాడు. అది తన తెలివితేటలు, మంచితనం, నిజాయితీతో బ్రియాన్‌ను ఎంత గానో ఆకట్టుకుంది. దీంతో దాన్ని కన్నబిడ్డలాగా చూసుకునేవాడు. ( ఊపిరాగిపోయే ఉత్కంఠ: చివరకేమైంది?..)
వారం రోజుల క్రితం ఇంట్లో ఎవరూ లేని సమయంలో బ్రియాన్‌కు గుండెపోటు వచ్చింది. నేలపై పడి నొప్పితో గిలగిల్లాడసాగాడు. యజమాని పరిస్థితిని గమనించిన శాడీ ఆయన దగ్గరకు వెళ్లింది. అతడు స్ప్రహ కోల్పోకుండా కళ్లను నాకటం ప్రారంభించింది. అనంతరం బ్రియాన్ చొక్కాను నోటితో కరుచుకుని సెల్‌ఫోన్ దగ్గరకు లాక్కెళ్లింది. ఆయన అంబులెన్స్‌కు ఫోన్ చేశాడు. బ్రియాన్‌ను అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించటం, వైద్యం అందించటం చకచకా జరిగిపోయాయి. బ్రియాన్ ప్రాణాలతో బయటపడ్డాడు. తాను సెకండ్ లైఫ్ ఇచ్చిన ఓ కుక్క తనకు సెకండ్ లైఫ్ ఇవ్వటం పట్ల మాటలకందని అనుభూతిని పొందుతున్నాడు.