మంకీపాక్స్‌ టెర్రర్‌.. ఒక్కరోజే 51 కేసులు.. ఈ వయస్సు వారే బాధితులు

France Confirms 51 Monkeypox Cases In One Day - Sakshi

కరోనా వేరియంట్లతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మంకీపాక్స్‌ రూపంలో మరో ఉపద్రవం తోడైంది. ఈ కొత్త వైరస్‌ మంకీపాక్స్‌ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. మంకీపాక్స్‌ను సీరియస్‌గా తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే హెచ్చరించింది. 

ఇదిలా ఉండగా.. ఫ్రాన్స్‌ను మంకీపాక్స్‌ వైరస్‌ ఆందోళనకు గురి చేస్తోంది. ఫ్రాన్స్‌లో శుక్రవారం ఒక్కరోజే 51 మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయని ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. బుధవారం నాటికి 33గా ఉన్న మొత్తం కేసుల సంఖ్య రెండు రోజుల్లోనే వందకు చేరువైంది. కాగా, ఫ్రాన్స్‌లో మొదటి మంకీపాక్స్‌ కేసు మే నెలలో నమోదు అయింది. ఇక, జూన్‌ నాటికి ఈ కేసుల సంఖ్య 100ను దాటింది. 

మరోవైపు.. మంకీపాక్స్‌ సోకిన వారందరూ పురుషులే కావడం గమనార్హం. ఇక వీరి వయస్సు 22 నుంచి 63 ఏళ్ల మధ్యే ఉందని ఫ్రెంచ్‌ నేషనల్ పబ్లిక్‌ హెల్త్‌ ఏజెన్సీ పేర్కొంది. ఇదిలా ఉండగా.. మంకీపాక్స్‌ సోకిన వారిలో ఒక్కరే మాత్రమే చికిత్స పొంది కోలుకున్నారని సదరు ఏజెన్సీ తెలిపింది. ఇక, ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకు 700 మంది మంకీపాక్స్‌ బారిన పడ్డారని అమెరికా సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ అండ్‌ ప్రివెన్షన్‌ తెలిపింది. అమెరికాలో ఇప్పటి వరకు 21 మంకీపాక్స్‌ కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. కాగా, కొత్త వైరస్‌ మంకీపాక్స్‌పై ప‍్రపంచ ఆరోగ్య సంస్థ కీలక ప్రకటన చేసింది. మంకీపాక్స్ బారినపడిన వారు రెండు నుండి నాలుగు వారాలలో కోలుకుంటారని స్పష్టం చేసింది. 

ఇది కూడా చదవండి: ఆయుధాలను నిషేధించాలన్న బైడెన్‌... కుదరదు అని చెప్పేసిన రిపబ్లికన్లు

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top