ట్రంప్‌తో ఫోన్‌లో సంభాషించిన ప్రధాని మోదీ | First Conversation Between Donald Trump And PM Modi After Winning US Presidential Election, Know What They Discussed | Sakshi
Sakshi News home page

Trump And PM Modi Call: ట్రంప్‌తో ఫోన్‌లో సంభాషించిన ప్రధాని మోదీ

Nov 7 2024 6:59 AM | Updated on Nov 7 2024 8:59 AM

First Conversation Between Trump and pm Modi After Winning Presidential Election

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చారిత్రాత్మక విజయం సాధించారు. ఈ నేపధ్యంలో డొనాల్డ్ ట్రంప్‌తో ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్‌లో సంభాషించారు. దీనిని ప్రధాని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో పంచుకున్నారు.

తన స్నేహితుడు, ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్‌తో తాను సంభాషించానని ప్రధాని మోదీ దానిలో రాశారు. అద్భుత విజయం సాధించినందుకు ట్రంప్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. సాంకేతికత, రక్షణ, ఇంధనం, అంతరిక్షం తదితర రంగాలలో భారతదేశం-యూఎస్ఏ సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు మరోసారి కలిసి పనిచేయడానికి ఎదురుచూస్తున్నామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

 

దీనికి ముందు ప్రధాని నరేంద్ర మోదీ తన సోషల్ మీడియా  వేదికగా ట్రంప్ సాధించిన చారిత్రాత్మక విజయానికి అభినందనలు తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. ట్రంప్‌ను విజేతగా ప్రకటించిన వెంటనే ప్రధాని మోదీ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్  ‘ఎక్స్‌’లో ‘ చారిత్రాత్మక విజయం సాధించిన స్నేహితుడు డొనాల్డ్ ట్రంప్‌కు హృదయపూర్వక అభినందనలు. మీరు మీ మునుపటి పదవీకాల విజయాలను ముందుకు తీసుకెళ్లబోతున్నారు. భారత్‌- యూఎస్‌ఏల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, పరస్పర సహకార పునరుద్ధరణకు ఎదురుచూస్తున్నాను. ఇరు దేశాల ప్రజల శ్రేయస్సును కాంక్షిస్తూ, ప్రపంచ శాంతి, స్థిరత్వం, అభివృద్ధిని ప్రోత్సహించేందుకు కలసి పని చేద్దాం’ అని పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: రాఘవేంద్ర స్వామి మఠంలో రిషి సునాక్‌ దంపతుల పూజ 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement