Christopher Wray : ‘ట్రంప్‌ రాకముందే నేనే రాజీనామా చేస్తా’ | FBI Director Christopher Wray announced he will resign in January | Sakshi
Sakshi News home page

Christopher Wray : ‘ట్రంప్‌ రాకముందే నేనే రాజీనామా చేస్తా’

Dec 12 2024 1:58 PM | Updated on Dec 12 2024 3:26 PM

FBI Director Christopher Wray announced he will resign in January

వాషింగ్టన్ : అమెరికా శక్తిమంతమైన దర్యాప్తు సంస్థ ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ)లో కీలక పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ జనవరి 20న బాధ్యతల్ని స్వీకరించనున్నారు. ఆ లోపే తన పదవికి రాజీనామా చేయనున్నట్లు ఎఫ్‌బీఐ  డైరెక్టర్ క్రిస్టోఫర్ వ్రే ప్రకటించారు. క్రిస్టోఫర్‌ నిర్ణయంపై ‘గ్రేట్ డే ఫర్‌ అమెరికా’‌ అంటూ ట్రంప్‌ ట్రూత్‌ సోషల్‌ వేదికగా వ్యాఖ్యానించారు.

‘కొంత కాలంగా సుదీర్ఘంగా సాగిన ఆలోచలన తర్వాత, ప్రస్తుత ప్రభుత్వ పాలన ముగిసే వరకు బాధ్యతలు నిర్వర్తిస్తా. ఆపై వైదొలగాలని నిర్ణయించుకున్నాను’ అని క్రిస్టోఫర్‌ వ్యాఖ్యానించారు. పదేళ్ల పదవీకాలంలో ఎఫ్‌బీఐ డెరెక్టర్‌గా క్రిస్టోఫర్‌కి మరో మూడేళ్లు ఉన్నాయి. అయినప్పటికీ ట్రంప్‌ రాకముందే పదవి నుంచి పక్కకి తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది.

2017లో 38,000 మంది ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇంటెలిజెన్స్‌కు అధిపతిగా క్రిస్టోఫర్‌ని ట్రంప్‌ నియమించారు. ఆ తర్వాత అమెరికాలో జరిగిన వరుస పరిణామల నేపథ్యంలో ట్రంప్‌పై క్రిస్టోఫర్‌ చర్యలు తీసుకున్నారు. తాజా, ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ నిర్ణయంపై ట్రంప్‌ స్పందించారు.

క్రిస్టోఫర్‌ రాజీనామా అమెరికాకు గొప్ప రోజు. క్రిస్టోఫర్ వ్రే నాయకత్వంలో ఎఫ్‌బీఐ ఎలాంటి కారణాలు లేకుండా నా ఇంటిపై అక్రమంగా దాడి చేసింది. చట్టవిరుద్ధంగా అభిశంసన, నేరారోపణలు చేయడంలో శ్రద్ధగా పనిచేసింది. అమెరికా విజయం, భవిష్యత్తుకు అంతరాయం కలిగించడానికి చేయాల్సిన వన్సీ చేసింది’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లోని పోస్ట్‌లో పేర్కొన్నారు.
 

తదుపరి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ కాష్‌ పటేల్‌
ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్విస్టిగేషన్‌ (ఎఫ్‌బీఐ) డైరెక్టర్‌గా తన సన్నిహితుడు కాష్‌ పటేల్‌ను అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ నామినేట్‌ చేశారు. ‘తదుపరి ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా కాష్‌ పటేల్‌ బాధ్యతలు చేపడతారని గర్వంగా ప్రకటిస్తున్నా. కాష్‌ ఎంతో తెలివైన న్యాయవాది, పరిశోధకుడు. అవినీతిపై పోరాటం, దేశ ప్రజల రక్షణ కోసం తన కెరీర్‌లో ఎక్కువ కాలం వెచ్చించిన పోరాటయోధుడు’ అని ప్రశంసించారు. 44 ఏండ్ల పటేల్‌ 2017లో ట్రంప్‌ హయాంలో యునైటెడ్‌ స్టేట్స్‌ సెక్రటరీ ఆఫ్‌ డిఫెన్స్‌కు చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌గా వ్యవహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement