వైరల్‌: అతడి చర్మాన్ని లాగితే మామూలుగా ఉండదు

England Man Holds Guinness Record For Stretchiest Skin - Sakshi

లండన్‌ : మన చర్మాన్ని గట్టిగా లాగితే ఏమౌతుంది? రెండు, మూడు సెంటీమీటర్లు సాగుతుంది. మరీ గట్టిగా లాగితే మరో రెండు సెంటీమీటర్లు సాగుతుంది! బాగా నొప్పి కూడా తీస్తుంది. కానీ, ఇంగ్లాండ్‌లోని లింకన్‌షేర్‌కు చెందిన 50 ఏళ్ల గ్యారీ టర్నర్‌ చర్మం మాత్రం ఎవరూ ఊహించనంత ముందుకు సాగుతుంది.  అది ఎంతంటే ఏకంగా 10 సెంటీమీటర్ల మేర. ఇక అతడి పొట్ట మీది చర్మం అయితే 15.8 సెంటీమీటర్లు సాగుతుంది. గ్యారీ చర్మం ఇంతలా సాగటానికి కారణం అతడికున్న ‘‘ఎహ్‌లర్స్‌ డాన్‌లోస్‌ సిండ్రోమ్‌’’ అనే అరుదైన శారీరక లోపమే. తన లోపాన్ని తలుచుకుని అతడెప్పుడూ అధైర్యపడలేదు.

దాన్నే తన ఉపాధిగా మలుచుకున్నాడు. తన చర్మాన్ని రకరకాలుగా సాగిదీస్తూ షోలు చేయటం మొదలుపెట్టాడు. చివరకు గిన్నిస్‌ వరల్డ్స్‌ రికార్డ్సులోనూ చోటు సాధించాడు. గ్యారీ మాట్లాడుతూ.. ‘‘ నా చర్మం ప్రత్యేకమైనదని నాకు తెలుసు. నేను చిన్నపిల్లాడిగా ఉన్నపుడు మా అంకుల్స్‌ వారి స్నేహితులకు నన్ను చూపించి నవ్వుకునేవారు. నా చర్మాన్ని గట్టిగా సాగదీయటం వల్ల నొప్పేమీ ఉండదు. కానీ, ఈ లోపం వల్ల కలిగే ఇతర ఇబ్బందులు బాధిస్తుంటాయి’’ అని 2012లో ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

చదవండి : పిచ్చి పీక్స్‌ అంటే ఇదే.. స్వీటు కోసం 200కి.మీ..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top