పిచ్చి పీక్స్‌ అంటే ఇదే.. స్వీటు కోసం 200కి.మీ..

Woman Travelled 200 KM To Eat Super Sweet Biscoff Pudding - Sakshi

వాషింగ్టన్‌ : పుర్రెకో బుద్ధి.. జిహ్మకో రుచి అన్నట్లు! వ్యక్తికి వ‍్యక్తికి మధ్య ఆలోచనల్లో.. అభిరుచుల్లో వ్యత్యాసాలు ఉంటాయి. ముఖ్యంగా తిండి విషయంలో.. కొంతమందికి హాట్‌ అంటే ఇష్టం ఉంటే.. మరికొంతమందికి స్వీట్లంటే ఇష్టం ఉంటుంది. ఇష్టమైన ఆహారాన్ని రోజులు, వారాలు తేడాలు లేకుండా లాగించేస్తుంటారు. ప్రతిరోజు తమకు ఇష్టమైన ఆహారం తినందే కొందరికి నిద్రపట్టదు. తమకిష్టమైన ఆహారాన్ని తినడానికి ఎంతటి కష్టాన్నైనా ఇష్టంగా భరిస్తారు. అచ్చంగా అమెరికాకు చెందిన వికీ గీ అనే యువతి లాగా.. కేంబ్రిడ్జ్‌కు చెందిన వికీ గీకి స్వీట్లంటే చాలా ఇష్టం. ప్రతీ రోజు స్వీట్‌ తినకపోతే ఉండలేదు. కొత్తకొత్త స్వీట్లు రుచి చూడటమే పనిగా మారిందామెకు. ఈ నేపథ్యంలో యార్క్‌ షేర్‌లోని బాన్స్‌లే ప్రాంతపు ఫేమస్‌ ఐటమ్‌ బిస్కాఫ్‌ పుడ్డింగ్‌ మీదకు ఆమె మనసు మళ్లింది. ఎలాగైనా దాన్ని రుచిచూడాలని భావించింది.

ఇందుకోసం వందల కిలోమీటర్ల దూరాన్ని కూడా ఆమె లెక్కచేయలేదు. కేవలం డెసర్ట్‌(తినుబండారం) తినడానికి బాన్స్‌లేలోని డాలీస్‌ డెసర్ట్స్‌ షాపునకు చేరుకుంది. ఇష్టమైన పదార్థాన్ని రుచి చూసి మైమరచిపోయింది. వికీ గీ గురించి తెలుసుకున్న షాపు సిబ్బంది. ఆమె గురించి టిక్‌టాక్‌లో ఓ వీడియో తీసి పెట్టారు. దీంతో వీడియో కాస్తా వైరల్‌గా మారింది. ఆమె మాట్లాడుతూ.. ‘‘ ఇది చాలా పిచ్చి పనిలా ఉంది. కానీ, దీన్ని తినడానికి మళ్లీ నేను వస్తా’’ నని అంది. దీనిపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘‘ పిచ్చిదానిలా ఉన్నావ్‌.. డెసర్ట్‌ కోసం 200కి.మీ ప్రయాణిస్తావా?..’’ ..‘‘పిచ్చి పీక్స్‌ అంటే ఇదే కాబోలు’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

చదవండి : వైరల్‌: ఓం కరోనా ఫట్‌,ఫట్‌,ఫట్‌ స్వాహా!..

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top