Elon Musk was Overtaken as Richest Person in the World - Sakshi
Sakshi News home page

ఫోర్భ్స్‌ కుబేరుల జాబితా: పాపం ఎలన్‌ మస్క్‌ అలా దిగజారి.. ఆ వెంటనే..

Published Thu, Dec 8 2022 9:00 AM

Elon Musk Was Overtaken As Richest Person In The World - Sakshi

న్యూయార్క్‌: ప్రపంచంలో అత్యంత ధనికుడి స్థానాన్ని ఎలన్‌ మస్క్‌ కోల్పోయాడు. అవును.. ఫోర్బ్స్‌ జాబితాలో ఆయన రెండో స్థానానికి దిగజారాడు. టెస్లా షేర్లు భారీగా పతనం కావడం, ట్విటర్‌ను 44 బిలియన్‌ డాలర్లతో కొనుగోలు చేసిన నేపథ్యంలో.. ఆయన సంపద కరిగిపోయి ఈ పరిణామం చోటు చేసుకుంది. అయితే..

ఎలన్‌ మస్క్‌ రెండో స్థానంలోకి చేరిన వేళ.. ప్రపంచంలో అత్యధిక ధనవంతుడిగా ఫ్రెంచ్‌ వ్యాపార దిగ్గజం బెర్నార్డ్ అర్నాల్ట్ నిలిచినట్లు ఫోర్బ్స్‌ ప్రకటించింది. అయితే ఈ పరిణామం మారడానికి ఎంతో టైం పట్టలేదు. 

వ్యక్తిగత సంపదను పెంచుకుని మస్క్‌ మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నాడు. ఫోర్బ్స్‌ జాబితా ప్రకారం.. అర్నాల్ట్‌ సంపద విలువ 184.7 బిలియన్‌ డాలర్లు. అలాగే.. మస్క్‌ సంపద 185.4 బిలియన్‌ డాలర్లకు చేరుకుంది. ఈ లిస్ట్‌లో మూడో స్థానంలో భారత్‌కు చెందిన గౌతమ్‌ అదానీ మూడోస్థానంలో, జెఫ్‌ బెజోస్‌ ఐదవ స్థానంలో, వారెన్‌ బఫెట్‌ ఐదో స్థానంలో నిలిచారు. భారత్‌ నుంచి ముకేశ్‌ అంబానీ ఎనిమిదవ స్థానంలో కొనసాగుతున్నారు.

ఇదిలా ఉంటే.. కిందటేడాది సెప్టెంబర్‌లో ప్రపంచంలో అత్యంత ధనికుడిగా ఉన్న అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌ బెజోస్‌ను కిందకు నెట్టేసి.. ఎలన్‌ మస్క్‌ అగ్రస్థానంలో నిలిచాడు. అప్పటి నుంచి ఆయన అదే స్థానంలో కొనసాగుతూ వస్తున్నారు. ఈ ఏడాది మొదట్లో ఆయన సంపద ఏకంగా 200 బిలియన్‌ డాలర్లు దాటడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement