Eight People Over Age 80 Set World Record By Jumping Out Of Plane, Know Details - Sakshi
Sakshi News home page

80 ఏళ్లు దాటాక గిన్నిస్‌ రికార్డు.. విమానం ఎక్కి, అక్కడ్నుంచి దూకేసి..

Oct 12 2022 7:22 PM | Updated on Oct 12 2022 8:20 PM

Eight People Over Age 80 Set world Record by Jumping Out of Plane - Sakshi

80 ఏళ్లు దాటాక మీరేం చేస్తుంటారు? ఓపికుంటే.. వాకింగ్‌కు వెళ్తారు లేదా మను­మలు, మనవరాళ్లతో ఆడుకుంటూ ఉంటారు..అంతేగా..అదే వయసులో ఉన్న వీళ్లేం చేశారో తెలుసా? విమానం ఎక్కేసి.. అక్కడ్నుంచి దూకేశారు. త­ద్వా­­రా గిన్నిస్‌ రికార్డు సాధించేశారు. జంపర్స్‌ ఓవర్‌ ఎయిటీ సొసైటీకి చెందిన ఈ 8 మంది అమెరికాలోని ఒర్లాండోలో స్కైడైవ్‌చేసి.. ఇలా సర్క్యులర్‌ ఫార్మేషన్‌ ఫీట్‌ను చేశారు. 80 ఏళ్లు దాటినవారిలో ఇంతమంది కలిసి ఒక స్కైడైవ్‌ ఫార్మేషన్‌ చేయడం ఇదే మొదటిసారట. ఇప్పటివరకూ ఆరుగురు కలిసి చేసినదే రికార్డుగా ఉంది.  

Advertisement
 
Advertisement
Advertisement