14 గంటల్లో..ఎనిమిది వందలసార్లు కంపించిన భూమి

Eight hundred earthquakes in 14 hours - Sakshi

రేగ్యావిక్‌: ఒక భూ కంపం వస్తేనే ప్రజలు వణికిపోతారు.పరిస్థితులు గందరగోళంగా తయారవుతాయి.అలాంటిది ఐస్‌లాండ్‌ దేశంలో కేవలం 14 గంటల్లో ఎనిమిది వందల సార్లు భూమి కంపించిందంటే ఆ దేశ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.వరుస భూ కంపాలు బెంబేలిత్తిస్తుండడంతో అక్కడి ప్రభుత్వం ఎమర్జెన్సీ విధించింది. 

ఐస్‌లాండ్‌ మెట్‌ ఆఫీస్‌ తెలిపిన దాని ప్రకారం రిక్టర్‌ స్కేల్‌పై 5.2 తీవ్రతతో గ్రిండావిక్‌ గ్రామంలో భారీ భూ ప్రకంపనలు సంభవించాయి.రాజధాని రేగ్యావిక్‌‌కు 40 కిలోమీటర్ల దూరంలో వచ్చిన ప్రకంపనల కారణంగా ఇళ్లలోని కిటికీల తలుపులు, వస్తువులు కొద్దిసేపు ఊగాయి.వరుస భూ ప్రకంపనలు సంభవించినపుడు అగ్నిపర్వతం బద్దలయ్యే చాన్సులు ఎక్కువగా ఉంటాయని అధికారులు తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో ప్రజలను తరలించేందుకు అత్యవసర షెల్టర్లు ఏర్పాటు చేశారు. ఐలాండ్‌ దేశంలో 33 యాక్టివ్‌ అగ్నిపర్వతాలు ఉన్నాయి.యూరప్‌లోనే ఇది అత్యధికం. 
ఇదీ చదవండి...అమెరికా ఎంక్యూ–9 డ్రోన్‌ పేల్చివేత

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top