భారత టీనేజర్‌ సరికొత్త ఐడియా

Dubai Based Indian Teenager Ishir Wadhwa Innovative Project - Sakshi

దుబాయ్‌: కొడుకుపై నమ్మకంతో పెద్ద ఉద్యోగాన్ని వదిలి వ్యాపారంలో దిగేందుకు ఓ తండ్రి సిద్ధపడ్డాడు. కుమారుడి ఆలోచనకు వాస్తవ రూపం ఇచ్చేందుకు ఆయన ఈ  సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నాడు. గోడలకు మేకులు కొట్టకుండానే బరువులను వేలాడదీసేందుకు దుబాయ్‌లో నివసిస్తున్న భారత టీనేజర్‌ సరికొత్త ఉపాయాన్ని కనిపెట్టాడు. జెమ్స్‌ వరల్డ్‌ అకాడమిలో ప్రస్తుతం 10వ గ్రేడ్‌ చదువుతున్న ఇషిర్‌ వాద్వా తన స్కూల్‌ ప్రాజెక్టు కోసం ఈ విభిన్న ఆలోచన చేశాడు. ఇంజినీరింగ్‌ చదువుతున్న తన సోదరుడు అవిక్‌ సాయంతో ఈ సరికొత్త మార్గాన్ని అన్వేషించారు.

కుటుంబ సభ్యులతో ఇషిర్‌ వాద్వా

ఈ పద్ధతిలో భాగంగా స్టీల్‌ టేపులను ముందుగా గోడకు అతికిస్తారు. ఆ తర్వాత నియోడిమియమ్‌ అయస్కాంతాన్ని ఉపయోగించి ఆ టేపులు బలంగా గోడకు అతుక్కొని ఉండేలా చేస్తారు. దీనికి వారు క్లాపిట్‌ అని పేరు పెట్టారు. తమ ఇంట్లోని హోం థియేటర్‌ సిస్టాన్ని ప్రస్తుతం క్లాపిట్‌కు తగిలించినట్లు ఇషిర్‌ తండ్రి సుమేశ్‌ వాద్వా తెలిపారు. ఎక్కువ వేతనం వస్తున్న తన ఉద్యోగాన్ని వదిలి క్లాపిట్‌ను తన కుటుంబ బిజినెస్‌గా మార్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు ‘ఖలీజ్‌ టైమ్స్‌’కు వెల్లడించారు.

చదవండి: ఒక కారును ఇలా కూడా వాడొచ్చా!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top