ఈ గొర్రె రేటెంతో తెలిస్తే షాక్‌ అవుతారు

Double Diamond Most Expensive Sheep In The World - Sakshi

ఈడిన్‌బర్గ్‌ : ఈ గొర్రె రేటు ఎంతో తెలిస్తే మనం నిజంగా నోరెళ్ల బెడతాము. ఓ గొర్రె ఇంత ఖరీదా? అని కచ్చితంగా అనుకుంటాం. గురువారం స్కాట్‌లాండ్‌, లనార్క్‌లో జరిగిన స్కాటిష్‌ లైవ్‌స్టాక్‌ వేలంలో డబుల్‌ డైమండ్‌ అనే గొర్రె ఏకంగా 3.5 కోట్ల రూపాయల ధర (£3,65,000) పలికింది. దీంతో ప్రపంచంలో అత్యంత ఖరీదైన గొర్రెగా పేరు సంపాదించింది. అంతకు ముందు 2,31,000 స్టెర్లింగ్‌ పౌండ్లపై ఉన్న‌ రికార్డును డైమండ్‌ బ్రేక్‌ చేసింది. డైమండ్‌ తర్వాతి స్థానంలో 68 వేల స్టెర్లింగ్‌ పౌండ్‌లతో హెక్సెల్‌ డ్జాంగో అనే గొర్రె నిలిచింది. ( ఆ ఏనుగులకు గంజాయి.. ఎందుకంటే?..)

చెషైర్‌, స్టాక్‌పోర్టుకు చెందిన  ప్రముఖ బ్రీడర్‌ చార్లీ బోడెన్‌కు చెందిన గొర్రెలలో డైమండ్‌ ఒకటి. టెక్సెల్‌ జాతికి చెందిన ఈ గొర్రెలు నెదర్లాండ్‌లోని టెక్సెల్‌ ప్రాంతానికి చెందినవి. యూకేలో వీటిని మాంసం కోసం ఎక్కువగా బ్రీడింగ్‌ చేస్తూ ఉంటారు. మామూలుగా ఈ గొర్రెలు 100 స్టెర్లింగ్‌ పౌండుల ధర పలుకుతుంటాయి. అధిక నాణ్యత కలిగిన గొర్రెలను మాత్రమే బీడింగ్‌ కోసం ఉపయోగిస్తుంటారు.
 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top