ట్రంప్‌ ఎన్నికల స్టంట్‌.. రంగంలోకి మోదీ! | Donald Trump Says i Will Meet PM Modi Next Week | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ఎన్నికల స్టంట్‌.. రంగంలోకి మోదీ!

Sep 18 2024 7:56 AM | Updated on Sep 18 2024 9:29 AM

Donald Trump Says i Will Meet PM Modi Next Week

న్యూయార్క్‌: అమెరికా పర్యటనకు రానున్న భారతదేశ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో వచ్చేవారం భేటీ అవుతానని మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత రిపబ్లిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ వెల్లడించారు. మంగళవారం మిచిగాన్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న  ట్రంప్‌ మాట్లాడుతూ.. ఈ ప్రకటన చేశారు. అదే విధంగా భారత ప్రధాని మోదీ ఓ అద్భుతమైన వ్యక్తి అని ప్రసంశలు కురిపించారు. 

అయితే మోదీతో భేటీకి సంబంధిచిన పూర్తి వివరాలను మాత్రం ట్రంప్‌ వెల్లడించలేదు.  అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ట్రంప్‌.. ప్రధాని మోదీతో భేటీ అవుతానని ప్రకటించటంపై ప్రాధాన్యత సంతరించుకుంది.

 

వచ్చే వారం సెప్టెంబర్‌ 21 నుంచి 23 వరకు ప్రధాని మోదీ అమెరికా పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షతను జరగనున్న నాలుగో క్వాడ్‌ సమ్మిట్‌లో ప్రధాని పాల్గొంటారు. సెప్టెంబర్‌ 21వ తేదీన న్యూయార్క్‌లోని భారతీయ సమాజాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. 22తేదీన న్యూయార్క్‌లో జరిగే ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ‘‘సమ్మిట్ ఆఫ్ ది ఫ్యూచర్‌’’లో కూడా ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు.

ఇక.. 2020 ఫిబ్రవరిలో భారతదేశాన్ని సందర్శించిన సమయంలో ట్రంప్‌.. ప్రధాని మోదీతో చివరిసారి కలుసుకున్నారు.

చదవండి: ట్రంప్ ‘ఐ హేట్ టేలర్ స్విప్ట్’ పోస్ట్.. క్యాష్ చేసుకున్న పాప్ స్టార్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement