
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. జన్మతః పౌరసత్వం రద్దు చేస్తూ ఫెడరల్ కోర్టులు ఇచ్చిన ఉత్తర్వులను ఆయన గురువారం (స్థానిక కాలమానం ప్రకారం) సవాల్ చేశారు. అత్యవసర పిటిషన్‌గా విచారణ చేట్టాలన్న అభ్యర్థనకు కోర్టు అంగీకరించింది.
అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే(జనవరి 20వ తేదీన) విదేశీయులకు జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఉత్తర్వులపై సంతకం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ వెంటనే ఆ ఉత్తర్వులకు వ్యతిరేకంగా పలు రాష్ట్రాల్లో పిటిషన్లు దాఖలుయ్యాయి. ఈ క్రమంలో ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ.. ఆ ఆదేశాలను తాత్కాలికంగా నిలిపివేశాయి మసాచుసెట్స్, మేరీలాండ్, వాషింగ్టన్ కోర్టులు.
అయితే కింది కోర్టులు ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా.. దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను నిలుపుదల చేయడం సరికాదని ట్రంప్ సర్కార్ తరఫున తాత్కాలిక సాలిసిటర్ జనరల్ సారా హారిస్ వాదనలు వినిపించారు. కాబట్టి అది అమలు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. అనంతరం విచారణ వాయిదా పడింది.
వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా వచ్చే పౌరసత్వ హక్కు (Birthright citizenship)ను ట్రంప్ రద్దు చేశారు. ఫిబ్రవరి 19వ తేదీ నుంచి ఈ ఉత్తర్వులు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ.. పలువురు ఫెడరల్ కోర్టులను ఆశ్రయించారు. పౌరసత్వ రద్దుకు సంబంధించి 22 రాష్ట్రాలు, పలు పౌరసంఘాలు మూకుమ్మడిగా కోర్టుల్లో పలు దావాలు వేశాయి. కోర్టు జోక్యంతో ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు నిలిచిపోయాయి.
14వ సవరణ ఎందుకు వచ్చిందంటే..
అమెరికాలో ఉత్తర, దక్షిణ రాష్ట్రాల మధ్య బానిసత్వం, హక్కుల సాధనగా మొదలైన అంతర్యుద్ధం 1861-65 మధ్య కొనసాగింది. ఈ యుద్ధంలో దాదాపు 6,20,000 మంది మరణించారు. ఆ తర్వాత రాజ్యాంగంలోని 14వ సవరణ ద్వారా బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ అమల్లోకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అమెరికా గడ్డపై పుట్టే ప్రతీ చిన్నారికి అక్కడి పౌరసత్వం లభిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment