బ్రెజిల్‌లో తుపాను బీభత్సం.. ఏడుగురు మృతి | Devastating Storm in Brazil | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌లో తుపాను బీభత్సం.. ఏడుగురు మృతి

Oct 13 2024 12:00 PM | Updated on Oct 13 2024 12:34 PM

Devastating Storm in Brazil

సావోపాలో: బ్రెజిల్‌లోని సావోపాలోను తాకిన భారీ తుపాను బీభత్సం సృష్టించింది. తుఫాను కారణంగా సంభవించిన వివిధ ప్రమాదాల్లో ఏడుగురు మృతి చెందారు. గంటకు 67 మైళ్ల (108 కిలోమీటర్లు) వేగంతో దూసుకొచ్చిన తుఫాను కారణంగా పలుచోట్ల చెట్లు నేలకూలాయని, కొన్ని ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని సావోపాలో అధికారులు తెలిపారు.

తుపాను తీవ్రతకు పలుచోట్ల కార్లు, ఇతర వాహనాలు నీటిలో కొట్టుకుపోయాయి. తుఫాను కారణంగా దేశంలోని పలు విమానాశ్రయాలను  మూసివేశారు. అనేక ప్రాంతాల్లో తాగునీటికి అంతరాయం ఏర్పడింది. వేలాది ఇళ్లు అంధకారంలో మగ్గుతున్నాయి. సావోపాలో మహానగరంలో 2 కోట్ల 10 లక్షల మంది తుపానుకు ప్రభావితమయ్యారు. 

ఇది కూడా చదవండి: సాహస యాత్రల్లో దిట్ట,, అనంతపురం నివాసి సమీరా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement