ఇంకా ముప్పు తప్పలేదు: నేపాల్‌కు శాస్త్రవేత్తల హెచ్చరిక! | Destructive Earthquake May Come Again | Sakshi
Sakshi News home page

Nepal Earthquake: నేపాల్‌కు శాస్త్రవేత్తల హెచ్చరిక!

Nov 4 2023 1:18 PM | Updated on Nov 4 2023 1:53 PM

Destructive Earthquake May Come Again - Sakshi

నేపాల్‌లో సంభవించిన భూకంపంలో 132 మంది మృతి చెందారు. లెక్కకు మించిన జనం గాయపడ్డారు. మృతుల సంఖ్య  మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. భూకంపం ప్రభావం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌తో పాటు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, బీహార్‌తో సహా అనేక ఇతర రాష్ట్రాల్లో కనిపించింది. నెల రోజుల వ్యవధిలో నేపాల్‌లో ఇది మూడో భూకంపం.

భూకంపం ముప్పు ఇంకా తప్పలేదని, అందుకే ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నేపాల్‌లో మరోమారు భూకంపం సంభవించవచ్చని వాడియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ మాజీ భూకంప శాస్త్రవేత్త అజయ్ పాల్ హెచ్చరించారు. గతంలోనూ పలువురు శాస్త్రవేత్తలు హిమాలయ ప్రాంతంలో ఎప్పుడైనా భారీ భూకంపం సంభవించవచ్చని అంచనా వేశారు. 

భారత టెక్టోనిక్ ప్లేట్ ఉత్తర దిశగా కదులుతుండటంతో అది యురేషియన్ ప్లేట్‌ను ఢీకొననుంది. ఫలితంగా హిమాలయాలపై ఒత్తిడి  ఏర్పడి, అనేక భూకంపాలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే రాబోయే భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై ఎనిమిది కంటే ఎక్కువగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇది ఎప్పుడు సంభవిస్తుందో చెప్పలేమని అంటున్నారు.
ఇది కూడా చదవండి: నేపాల్‌లో తరచూ భూకంపాలు ఎందుకు వస్తాయి?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement