3 వేల ఏళ్లయినా ‘కత్తి’లా ఉంది! | Dazzling ancient bronze sword found in Germany | Sakshi
Sakshi News home page

3 వేల ఏళ్లయినా ‘కత్తి’లా ఉంది!

Jun 19 2023 6:26 AM | Updated on Jun 19 2023 7:35 AM

Dazzling ancient bronze sword found in Germany - Sakshi

బెర్లిన్‌: సుమారు మూడు వేల ఏళ్లనాటి కంచు కత్తి జర్మనీలో తవ్వకాల్లో బయటపడింది. ఇప్పటికీ ఆ కత్తి పదును, మెరుపు ఏమాత్రం తగ్గలేదని పురాతత్వ నిపుణులు తెలిపారు. బవేరియా రాష్ట్రంలోని నోయెర్డ్‌లింజెన్‌లో జరిపిన తవ్వకాల్లో ఇది వెలుగు చూసింది.

క్రీస్తుపూర్వం 14వ శతాబ్దం..కంచుయుగం మధ్య కాలం నాటి ముగ్గురు వ్యక్తుల సమాధిలోని అష్టభుజి పట్టీ కలిగిన ఈ కత్తి ఇప్పటికీ కొత్తదిగానే ఉండటం అద్భుతం, అరుదైన విషయమన్నారు. క్రీస్తు పూర్వం 3,300–12,00 సంవత్సరాల మధ్య మానవులు కంచు వాడిన కాలాన్ని చరిత్రకారులు కంచుయుగంగా గుర్తిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement