అతిథుల డ్యాన్స్‌.. కూలిపోయిన రిసెప్షన్‌ వేదిక

Dance Floor Collapses During Wedding In Italy - Sakshi

వధువరులు, బంధువులు ఆనందంతో ఎంజాయ్‌ చేసే వివాహ రిసెప్షన్‌లో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. వేడుకలో భాగంగా డ్యాన్స్‌ చేసే​ క్రమంలో అకస్మాత్తుగా వెడ్డింగ్‌ హాల్ ఫ్లోర్‌ కూలిపోయింది. ఈ ఘటన ఇటలీలో చోటు చేసుకుంది. వధువరులతో పాటు సుమారు 30 మంది అతిథులు 25 అడుగుల ఎత్తులో ఉన్న ఫ్లోర్‌ను నుంచి కిందకు పడిపోయారు. దీంతో గాయపడిన వారిని స్థానిక అస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే... వరుడు పాలో ముగ్నైనీ, వధువు వలేరియా యబరా తమ వివాహాన్ని ఇటలీలోని పిస్టోయాలో ఉన్న ఓ వెడ్డింగ్‌ హాల్‌లో ఏర్పాటు చేశారు. హాల్‌లోని వేదిక‌పై నూత‌న వ‌ధూవ‌రుల‌తో పాటు సుమారు 30 మంది అతిథులు ఉన్నారు.

ఆనందంతో వారంతా డ్యాన్స్ చేయటం మొదలు పెట్టారు. దీంతో ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. అంద‌రూ వేదిక చెక్క‌ల మ‌ధ్య ఇరుక్కుపోయారు. స‌మాచారం అందుకున్న పోలీసులు.. ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. శిథిలాల‌ను తొల‌గించి, గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ఆరుగురి ప‌రిస్థితి విషమంగా ఉన్న‌ట్లు తెలిపారు. గాయపడ్డవారంతా పిస్టోయాలోని శాన్ జ‌కోపో ఆస్పత్రిలో చికిత్స పొందతున్నారని వెల్లడించారు. 

ఈ ఘటనపై పెళ్లి కొడుకు ముగ్నైని మాట్లాడుతూ.. ‘రిసెప్షన్‌ వేదిక కుప్ప‌కూలే ముందు అంతా సంతోషంగా ఉన్నాం. అతిథులు డాన్స్‌ చేసే​సరికి ఒక్కసారిగా వేదిక కూలిపోయింది. నేను కూడా వాళ్లతోపాటు ప‌డిపోయాను. నాపై చాలా మంది ప‌డ్డారు. వెంటనే నా భార్య వలేరియా ఎక్కడ ఉందో వెతికాను. ఆమె క‌నిపించ‌క‌పోయే స‌రికి తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌య్యాను. చివ‌ర‌కు ఇద్ద‌రం క‌లిసి ఆస్పత్రిలో చేరాం.. ప‌క్క‌ప‌క్క బెడ్‌లో ఉండి చికిత్స పొందుతున్నాం’ అని ముగ్నైని  తెలిపారు.

చదవండి: Pakistan: పార్టీ జెండాపై గొడవ.. కన్న కొడుకును హతమార్చిన తండ్రి

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top