అమానుషం.. పదేళ్లకే బిడ్డకు జన్మనిచ్చింది

Colombia Girl Aged 10 Gives Birth After Molestation - Sakshi

బొగోటా(కొలంబియా): ప్రపంచ వ్యాప్తంగా మహిళలపై దారుణాలకు అడ్డులేకుండా పోతుంది. పసి మొగ్గలను కూడా వదలడం లేదు మృగాళ్లు. ఆడుతూ పాడుతూ ఎదగాల్సిన చిన్నారులు అకృత్యాలకు బలవుతున్నారు. ఈ నేపథ్యంలో కొలంబియాలో దారుణం వెలుగు చూసింది. అమ్మ ప్రేమ, నాన్న గారం.. స్నేహితులు, ఆటలు తప్ప మరొకటి తెలియని పదేళ్ల చిన్నారి ఓ బిడ్డకు జన్మనిచ్చింది. గత 26 రోజులుగా పసి గుడ్డును ఆ చిట్టితల్లి కాపాడుకుంటుంది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. బాధితురాలి పేరు వెల్లడించలేదు. మరో దారుణం ఏంటంటే తనకు ఏం జరిగిందో.. ఎవరు తనపై ఇంత పశుత్వాన్ని ప్రదర్శించారో ఆ చిట్టితల్లి చెప్పలేకపోతుంది. ఎనిమిదో ఏట నుంచే చిన్నారిపై ఈ దాడి మొదలయ్యిందని అధికారులు భావిస్తున్నారు. ప్రాడో మున్సిపాలిటిలో నివసిస్తున్న బాలికను, ఆమె బిడ్డను ప్రస్తుతం ఇబాకో నగరంలోని మెడికల్‌ కేర్‌ సెంటర్‌లో ఉంచి సంరక్షిస్తున్నారు. 

ఈ క్రమంలో తొలిమా గర్నరర్‌ రికార్డో ఒరోజ్కో మీడియాతో మాట్లాడుతూ.. ‘బాధితురాలు బిడ్డకు జన్మనిచ్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. దీని గురించి ఆమె ఏం మాట్లడలేకపోతుంది. కేసు నమోదు చేశాం. దీనికి సంబంధించి ఇద్దరు వ్యక్తులని అనుమానిస్తున్నాం. బాధితురాలి సవతి తండ్రి(43), అక్కడే పొలాల్లో పని చేసే మరో వ్యక్తి(23)ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. ఇక ఇలాంటి దారుణాలు ఎక్కువగా బయటపడటం లేదు. చాలా కేసుల్లో కొడుకు, అంకుల్‌, తాత, సమీప బంధువులు నిందితులుగా ఉంటున్నారు. దాంతో ఈ దారుణాలను కప్పి పుచ్చుతున్నారు. ఇక కొలంబియాలో అత్యాచారం, తల్లి ప్రాణానికి ప్రమాదం ఉన్న సందర్భాల్లో అబార్షన్‌ చేయడానికి ప్రభుత్వం అనుమతిస్తుంది. అయితే చిన్నారి విషయంలో ఇది ఎందుకు పాటించలేదో తెలియడం లేదు’ అన్నారు. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top