ఉక్రెయిన్‌తో చర్చలకు సిద్ధం

Chinese President Jinping holds telephone conversation with Ukraine - Sakshi

జిన్‌పింగ్‌కు తెలిపిన పుతిన్‌

బీజింగ్‌: ఉక్రెయిన్‌పై యుద్ధానికి దిగిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ శుక్రవారం మిత్ర దేశం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ఉక్రెయిన్‌తో ఉన్నతస్థాయి సంభాషణలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఈ సందర్భంగా పుతిన్‌ తెలపగా సంక్షోభం ముదరకుండా రెండు దేశాలు చర్చలు ప్రారంభించాలని అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో చెప్పారని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. ఉక్రెయిన్‌ ఒకప్పుడు రష్యాలో అంతర్భాగమేనని జిన్‌పింగ్‌కు వివరించారని తెలిపింది.

భద్రతపై రష్యా వెలిబుచ్చుతున్న న్యాయపరమైన ఆందోళనలను అమెరికాతోపాటు నాటో కూటమి దేశాలు ఏళ్లుగా నిర్లక్ష్యం చేశాయని పుతిన్‌ చెప్పారు. హామీలను మరిచి, రష్యా వ్యూహాత్మక భద్రతకు భంగం కలిగించేలా సైనిక మోహరింపులను పెంచుతూ వచ్చాయని చెప్పారు. బదులుగా జిన్‌పింగ్‌.. వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా చైనా వైఖరి ఉందని వివరించారు. ‘ఈయూ, అమెరికాలు ప్రచ్ఛన్నయుద్ధం కాలం నాటి ఆలోచనలను పూర్తిగా విడనాడాలి. దేశాల న్యాయమైన భద్రతాపరమైన ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవాలి’ అని పేర్కొన్నారని జిన్హువా వెల్లడించింది.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top