భారత్‌కు మద్దతుగా నిలిచిన చైనా.. షాక్‌లో ప్రపంచ దేశాలు!

China Media Comments On India Wheat Issue - Sakshi

డ్రాగన్‌ కంట్రీ చైనా అనూహ్యంగా భారత్‌కు మద్దతుగా నిలిచింది. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు ఒక్కసారిగా ఖంగుతిన్నాయి. గోధుమల ఎగుమతిపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో నిత్యవసర ధరల పెరుగుదలతో వ్యవసాయ ఉత్పత్తులపై ఎండల ప్రభావం, ఆహార భద్రత వంటి కారణాలతో గోధుమల ఎగుమతిని నిషేధించింది. ఈ సందర్భంగా  ముందస్తు ఒప్పందాల వరకు మాత్రమే ఎగుమతి చేసుకోవచ్చని తెలిపింది. భవిష్యత్తు ఎగుమతులపై నిషేధం విధిస్తున్నట్టు పేర్కొంది. 

కాగా, భారత్‌ నిర్ణయంపై జీ 7 దేశాలు తప్పుబట్టాయి. దీంతో అనూహ్యంగా భారత్‌కు డ్రాగన్‌ కంట్రీ చైనా మద్దతు తెలిపింది. గోధుమ ఎగుమతి నిలిపివేతపై జీ 7 దేశాలు భారత్‌ను విమర్శించడం సరికాదని వ్యాఖ్యానిస్తూ చైనా అధికార పత్రిక గ్లోబల్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. ఆ కథనంలో గోధుమ ఎగుమతుల నిషేధంపై భారత్‌ను విమర్శిస్తున్నారు కరెక్టే.. అయితే జీ 7 దేశాలు తమ ఎగుమతులను పెంచడం ద్వారా ఆహార మార్కెట్ సరఫరాను స్థిరీకరించడానికి ఎందుకు ముందుకు రావడం లేదంటూ ప్రశ్నించింది. ప్రపంచ గోధుమ ఎగుమతుల్లో భారత్‌ది చిన్న వాటానే అంటూ కామెంట్స్‌ చేసింది. 

ఈ క్రమంలోనే ఈయూ, అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలు గోధుమ ప్రధాన ఎగుమతిదారులంటూ కౌంటర్‌ ఇచ్చింది. అనంతరం గోధుమ ఎగుమతులపై భారత్‌ను విమర్శించడం మానేసి ఆహార సంక్షోభాన్ని పరిష్కరించే ప్రయత్నాలను జీ-7 దేశాలు చేపట్టాలని సూచించింది. 

ఇది కూడా చదవండిరష్యాకు మరో షాక్‌! నాటోలో చేరనున్న మరోదేశం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top