China Corona Situation: చైనాను కుదిపేస్తున్న కరోనా.. రోజుకు ఏకంగా 10 లక్షల కేసులు 

China Corona Situation: Zhejiang Has 1 Million Cases Coming Everyday - Sakshi

బీజింగ్‌: చైనాలో కరోనా నానాటికీ చుక్కలు చూపుతోంది. రోజూ లక్షలాది మంది దాని బారిన పడుతున్నారు. షాంఘై సమీపంలోని పారిశ్రామిక నగరం జిజెయాంగ్‌లో రోజుకు కనీసం 10 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఇవి రోజుకు పాతిక లక్షలు దాటొచ్చని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రులకు రోగుల వెల్లువ నానాటికీ పెరుగుతోంది. మార్చురీల బయట శవాలు గుట్టలుగా పేరుకుంటున్నాయి. చాలాచోట్ల కనీసం 10 రోజులకు పైగా వెయిటింగ్‌ పీరియడ్‌ నడుస్తోంది.

ఒకవైపు కేసులు ఇలా కట్టలు తెంచుకుంటుంటే మరోవైపు వాటి కట్టడి ప్రయత్నాలను, నిబంధనలను పూర్తిగా గాలికొదిలేస్తూ చైనా ప్రభుత్వం హఠాత్తుగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులను పూర్తిగా తెరవాలని నిర్ణయించింది. అంతేగాక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడేళ్లుగా అమలు చేస్తున్న క్వారంటైన్‌ నిబంధనను కూడా పూర్తిగా ఎత్తేయనుంది.

ఇవన్నీ జనవరి 8 నుంచి అమల్లోకి వస్తాని ప్రకటించింది. ఇందుకు వీలుగా కరోనాను డెంగీ తదితర జ్వరాలతో సమానమైన బి కేటగిరీకి తగ్గిస్తూ జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య వెల్లడిని కూడా ఆదివారం నుంచి చైనా ఆపేయడం తెలిసిందే.  
చదవండి: Bomb Cyclone: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top