కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి..

కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల కలకలం.. ఏడుగురు మృతి.. - Sakshi

అమెరికా కాలిఫోర్నియాలో మరోసారి కాల్పుల మోతమోగింది. సోమవారం రెండు వేరు చోట్ల ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో  ఏడుగురు మరణించారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. అతడ్ని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

సాన్ మటేవో కౌంటీలోని హాల్ఫ్ మూన్‌ బే ప్రాంతంలో  ఈ ఘటనలు జరిగాయి. సోమవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో ఓ పుట్టగొడుగుల ఫామ్‌లోని ఇంట్లోకి ప్రవేశించి దుండగుడు కాల్పులు జరిపాడు. మొత్తం నలుగురిని హతమార్చాడు. ఆ తర్వాత కాసేపటికి ఓ ట్రక్కు కంపెనీ షెడ్డు వద్ద మరో ముగ్గుర్ని కాల్చి చంపాడు. ఇంకొకరికి కూడా బుల్లెట్ గాయాలయ్యాయి. రంగంలోకి దిగిన పోలీసులు సాయంత్రం 5 గంటల్లోగా నిందితుడ్ని అదుపులోకి తీసుకున్నారు. కస్టడీకి తరలించి విచారిస్తున్నారు.

శాన్‌ఫ్రాన్సిస్కోలో ఇటీవల మాస్ షూటింగ్ ఘటనలు తరచూ జరగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. రెండు రోజుల క్రితమే చైనీస్ న్యూ ఇయర్ వేడుకపై ఓ దుండగుడు దాడికి  తెగబడ్డాడు. ఈ ఘటనలో 10 మంది చనిపోయారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. నిందితుడు కూడా ఘటనా స్థలంలోనే తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
చదవండి: అల్లాడుతున్న పాకిస్తాన్‌ ప్రజలు.. దేశవ్యాప్తంగా కరెంట్‌ కట్‌!

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top