అల్లాడుతున్న పాకిస్తాన్‌ ప్రజలు.. దేశవ్యాప్తంగా కరెంట్‌ కట్‌!

Pakistan Power Outage People Live in Dark - Sakshi

ఇస్లామాబాద్‌: ఇప్పటికే ఆర్థిక కష్టాలతో అల్లాడిపోతున్న పాకిస్తాన్ నెత్తిపై మరో పిడుగు పడింది. అకాశన్నంటిన నిత్యావసరాల ధరలు, ఉపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు మరో కష్టం వచ్చిపడింది. నేషనల్ గ్రిడ్ ఫెయిల్యూర్ కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు సోమవారం అంధకారంలోనే గడిపారు.  హోటళ్లు, రెస్టారెంట్లు దీపాల వెలుగులోనే నడిచాయి. సాధారణ పౌరులు ఇళ్లలో కొవ్వత్తులు వెలిగించుకొని జీవనం సాగించారు.

నేషనల్ గ్రిడ్‌లో ఫ్రీక్వెన్సీ పడిపోడవంతో సోమవారం ఉదయం 7:30 గంటలకు దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా ఆగిపోయింది. దీన్ని పునరుద్ధరించేందుకు అధికారులు వెంటనే చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేకపోయింది. అయితే ఎట్టకేలకు ఇస్లామాద్, గుజ్రావాలా ప్రాంతాల్లో మాత్రం విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించారు. మిగతా నగరాల్లో కూడా పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు విద్యత్ శాఖ మంత్రి ఖురాం దస్తగిర్ పేర్కొన్నారు.

కరెంటు కోతలు సహజమే..
విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటున్న పాకిస్తాన్‌లో కరెంటు కోతలు సర్వసాధరణమైపోయాయి. హాస్పిటళ్లు, ఫ్యాక్టరీలు, ప్రభుత్వ సంస్థలు ప్రైవేటు జనరేటర్ల సాయంతో నడుస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.  పాఠశాలల్లో కూడా వెలుతురు లేకుండానే పాఠాలు బోధిస్త్నున్నారు. కొన్ని చోట్ల బ్యాటరీతో నడచే లైట్లను ఉపయోగిస్తున్నారు.

అయితే దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయిన సందర్భాలు మాత్రం చాలా తక్కువే. గతంలో 2021లో గ్రిడ్ ఫెయిల్యూర్‌ కారణంగా పాక్ మొత్తం విద్యుత్‌ సరఫరాకు ఆటంకం ఏర్పడింది. ఇప్పుడు మరోసారి ఇదే కారణంతో దేశం మొత్తం అంధకారంలోకి వెళ్లింది.
చదవండి: ఆందోళనలతో అట్టుడుకుతున్న బ్రెజిల్, పెరు.. ఏమిటీ సమస్య?

మరిన్ని వార్తలు :

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top