మాలి: నదిలో పడ్డ బస్సు.. 31 మంది మృతి

Bus Fell Into River In Mali 31 Dead - Sakshi

బమాకో: పశ్చిమ ఆఫ్రికాలోని మాలిలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 31 మంది మరణించారు. మంగళవారం రాత్రి కెనీబా పట్టణంలో బ్రిడ్జిపై నుంచి వెళుతున్న బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. డ్రైవర్‌ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బస్సు బుర్కినా ఫాసోకు వెళుతుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

ప్రమాదంలో చనిపోయిన వారిలో మాలి పౌరులతో పాటు ఇతరులు కూడా ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. పశ్చిమ ఆఫ్రికాలో ప్రజా రవాణాలో ఏ మాత్రం ప్రమాణాలు ఉండవు. బస్సులు, రైళ్లు కిక్కిరిసి వెళుతుంటాయి. దీంతో ఇక్కడ ప్రమాదాలు జరగడం సర్వసాధారణం.  

ఇదీ చదవండి.. రష్యా హక్కుల నేతకు 30 నెలల జైలు 

whatsapp channel

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram


 

Read also in:
Back to Top