
లండన్: బ్రిటన్‌రా జు చార్లెస్–3 త మ్ముడు ప్రిన్స్ ఆండ్రూ(65) తన రాయల్ టైటిల్ ‘డ్యూక్ ఆఫ్ యార్క్’ను వదులుకున్నారు. ఇకపై అన్ని రాచ బిరుదులను, మర్యాదలను సైతం వదిలేసు కుంటున్నట్లు ఆండ్రూ ఎక్స్ వేదికగా ప్రక టించారు.
అమెరికాను కుదిపేసిన ఎప్‌స్టీన్ సెక్స్ కుంభకోణంతో ప్రిన్స్ ఆండ్రూకు సంబంధాలున్నట్లు ఇటీవల తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రాజ కుటుంబం నుంచి వస్తున్న ఒత్తిడుల మేరకు ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా భావిస్తున్నారు. ఇప్పటికే ఆయన హిజ్ రాయల్ హైనెస్ (హెచ్‌ఆర్‌హెచ్)ను వాడటం ఆపేశారు.