అమ్మాయిలుగా మారిన ఐడెంటికల్‌ ట్విన్స్‌

Brazil Identical Twins Undergoes With Gender Confirmation Surgery - Sakshi

బ్రెజిల్‌ : ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా ఐడెంటికల్‌ ట్విన్స్‌.. జెండర్‌ కన్ఫర్మేషన్‌ సర్జరీ(లింగమార్పిడి సర్జరీ)తో ఆడవాళ్లుగా మారారు. ఈ సంఘటన బ్రెజిల్‌లో చోటుచేసుకుంది. వివరాలు.. ఆగ్నేయ బ్రెజిల్‌కు చెందిన ఇద్దరు ఐడెంటికల్‌ ట్విన్స్‌ మాల్యా, సోఫియాలు పుట్టుకతో అబ్బాయిలు. అయితే పెరుగుతున్న కొద్ది వారిలో మార్పులు చోటు చేసుకోసాగాయి. అబ్బాయిలుగా కంటే అమ్మాయిలుగా తమను గుర్తించుకోవటానికే ఇష్టపడేవారు. తమను అమ్మాయిలుగా మార్చేయమని దేవుడ్ని ప్రార్థించేవారు. లింగమార్పిడి సర్జరీ ద్వారా అమ్మాయిలుగా మారాలని ఎప్పటినుంచో అనుకుంటున్నారు.

ఇందుకు వారి ఫ్యామిలీనుంచి కూడా సపోర్ట్‌ దొరికింది. వీరి తాతయ్య ఆపరేషన్‌ కోసం పెద్ద మొత్తంలో డబ్బులు సహాయం చేశాడు. వారం క్రితం వీరిద్దరికీ ఓ రోజు తేడాతో లింగమార్పిడి సర్జరీ జరిగింది. దీనిపై మాల్యా మాట్లాడుతూ.. ‘‘నాకు నా శరీరం అంటే చాలా ప్రేమ, కానీ, నా జననాంగాన్ని ఇష్టపడేదాన్ని కాదు. నన్ను అమ్మాయిగా మార్చేయమని దేవుడ్ని ప్రార్ధించే దాన్ని’’ అని పేర్కొంది.

చదవండి : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సరిహద్దులోకి వ్యక్తి..

 కోపంతో నా ఫ్రెండ్‌ ముక్కు పగులగొట్టా: ఒబామా

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top