మరోసారి కరోనా విజృంభణ.. రెండు వారాలపాటు లాక్‌డౌన్‌

Brazil Capital Rio De Janeiro Returns To Covid19 Lockdown - Sakshi

రియో డీ జెనీరో: బ్రెజిల్‌లోని రియో డీ జెనీరోలో కరోనా మళ్లీ పడగ విప్పుతోంది. ఆసుపత్రులు కరోనా బాధితులతో నిండిపోతున్నాయి. దీంతో రాజధానిలో రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ విధిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ ఆదివారం అమల్లోకి వచ్చింది. బ్రెజిల్‌లోని పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అప్రమత్తమయ్యింది.

నియంత్రణ చర్యలను ముమ్మరం చేసింది. నగరాలు, ముఖ్య పట్టణాల్లో గత వారం రోజులుగా కర్ఫ్యూ కొనసాగిస్తున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా కారణంగా 2,54,000 మంది మరణించారు. గత గురువారం ఒక్కరోజే 1,541 మంది ప్రాణాలు కోల్పోయారు. బ్రెజిల్‌లో మార్చి 15 వరకు హోటళ్లు, బార్లు, షాపింగ్‌ మాల్స్, స్కూళ్లు మూసివేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.   

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top