ఇరాన్‌కు అంత సామర్థ్యం ఉందా?.. అలా అయితే వణుకే! | Big Question On Iran Undeclared Capabilities | Sakshi
Sakshi News home page

ఇరాన్‌కు అంత సామర్థ్యం ఉందా?.. అలా అయితే వణుకే!

Mar 21 2026 5:59 PM | Updated on Mar 21 2026 6:13 PM

Big Question On Iran Undeclared Capabilities

ఇరాన్‌.. అమెరికా-ఇజ్రాయెల్‌లు సంయుక్తంగా చేస్తున్న యుద్ధాన్ని ఎదుర్కోంటుంది.  ఈ దేశాల మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు మూడు వారాలు అయ్యింది. అయినా ఇప్పటికీ ఏ ఒక్కరూ కూడా వెనక్కి తగ్గలేదు. తొలుత ఇరాన్‌పై యుద్ధానికి దిగినప్పుడు ఆ దేశాన్ని సులువుగానే అదుపులోకి తేవొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అనుకొని ఉంటారు. కానీ ఆ అంచనా తప్పని ట్రంప్‌కు ఈపాటికి అర్థమై ఉంటుంది. అందుకే హార్మూజ్‌ జలసంధి భద్రత విషయంలో పలు దేశాల సాయాన్ని కూడా కోరారు. 

అదే సమయంలో అమెరికా అత్యాధునిక ఎఫ్‌-35 విమానం.. ఇరాన్‌ దెబ్బకు కుప్పకూలిపోయింది. ఎటువంటి రాడార్‌ వ్యవస్థలకు చిక్కకుండా దాడి చేసే అత్యంత ఖరీదైన యుద్ధ విమానం కుప్పకూలిపోవడం ట్రంప్‌కు కచ్చితంగా మింగుడు పడని అంశం.  దీన్ని కాసేపు పక్కకు పెడితే ఇప్పుడు ఇరాన్‌ మరో భయాన్ని కూడా పుట్టించిందనేది మరో వార్త.  అమెరికా-యూకే స్థావరం వైపు ఇరాన్ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది మరింత ఉద్రిక్తతలకు తావిస్తోంది. 

హిందూ మహాసముద్రంలోని డిగో గార్సియాలో ఉన్న అమెరికా-యూకే స్థావరం వైపు ఇరాన్ రెండు మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించిందట. ఇరాన్ నుండి డిగో గార్సియా సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉంది, అంటే దాడి చేసే పరిధి చాలా ఎక్కువ. అసలు ఇరాన్‌ గతంలో ప్రకటించిన దానికి ఇది రెట్టింపు సామర్థ్యం కల్గి  ఉందని అర్థం. అంతకముందు ఇరాన్‌ తమ బాలిస్టిక్ క్షిపణుల రేంజ్‌ 2,000 కిలోమీటర్లు అని బహిరంగంగానే చెప్పింది. మరి ఇప్పుడు ఈ ట్విస్ట్‌ ఏమిటో అర్థం కావడం లేదు.

ఇరాన్‌ గోప్యత పాటిస్తుందా?
ఇరాన్‌ ఏమైనా అత్యాధునిక టెక్నాలజీతో క్షిపణులను తయారు చేసిందా.. లేక  ఎక్కడ నుంచైనా కొనుగోలు చేసిందా అనేది చిక్కు ప్రశ్న. ఇరాన్‌ అప్రకటిత క్షిపణుల సామర్థ్యం అంత ఉంటే భవిష్యత్‌లో పరిస్థితి ఏంటనేది చర్చనీయాంశంగా మారింది. నిజంగానే ఇరాన్‌ ఆ రేంజ్‌తో దాడికి దిగితే ప్రపంచానికి తెలియని సామర్థ్యం అనేది ఆ దేశం వద్ద ఉన్నాయని అర్థం చేసుకోవాలి. 

తన వాస్తవ దాడి పరిధిపై శత్రువులకు స్పష్టత లేకుండా చేయడం ద్వారా, ఇరాన్‌ పరోక్షంగా పైచేయి సాధించడానికి కూడా సహాయపడుతుంది. ఈ అస్పష్టత అమెరికా,  యూకేల ప్రణాళికలను సైతం క్లిష్టతరం చేస్తుంది. ఇది ఇజ్రాయెల్‌కే కాదు.. గల్ఫ్‌ దేశాలకు కూడా భయం పుట్టించేది అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. 

డియాగో గార్సియా ఒక చిన్నస్థావరం కాదు.. 
 ఇది అమెరికా ప్రపంచ శక్తి ప్రదర్శనకు ఒక అత్యంత విలువైన కేంద్రం. ఇది ఒక కీలకమైన లాజిస్టిక్స్.  అమెరికా యుద్ధ ప్రణాళికకు కూడా ఇది  వేదికగా పనిచేస్తుంది. ఇది అమెరికా భారీ బాంబర్లు, నిఘా విమానాలకు నిలయంగా చెబుతారు.

మరి ఆ స్థావరాన్ని ఇరాన్‌ లక్ష్యంగా చేసుకోవడం అనేది  శత్రువు ఇంతకుముందు ఊహించిన దానికంటే ఇరాన్ క్షిపణుల పరిధి చాలా ఎక్కువ అని చూపే ఒక ముఖ్యమైన ముందడుగుగా ఇరాన్ వార్తా సంస్థ ఒకటి అభివర్ణించింది.

ఇదీ చదవండి:
ఇరాన్ ‘ఉండేలు దెబ్బ’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement