బైడెన్‌ దంపతుల ఆదాయమెంతో తెలుసా? | Bidens Tax Return Shows Steep Fall In Income | Sakshi
Sakshi News home page

బైడెన్‌ దంపతుల ఆదాయమెంతో తెలుసా?

May 19 2021 3:45 AM | Updated on May 19 2021 12:43 PM

Bidens Tax Return Shows Steep Fall In Income - Sakshi

ఆదాయ పన్ను చెల్లింపుల వివరాలను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ దంపతులు, దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ దంపతులు వెల్లడించారు.

వాషింగ్టన్‌: 2020 ఏడాదికి సంబంధించిన ఆదాయ పన్ను చెల్లింపుల వివరాలను అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ దంపతులు, దేశ ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌ దంపతులు సోమవారం వెల్లడించారు. 2020 ఏడాదిలో బైడెన్‌ దంపతుల స్థూల ఆదాయం దాదాపు రూ.4.43 కోట్లు( 6,07,336 డాలర్లు) అని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌ పేర్కొంది. 2019లో బైడెన్‌ దంపతుల స్థూల ఆదాయం దాదాపు 7.19 కోట్లు( 9,85,223 డాలర్లు) కావడం గమనార్హం.

ఈ ఆదాయానికి 2020లో అమల్లో ఉన్న చట్టాల ప్రకారం దాదాపు రూ.1.14 కోట్ల(1,57,414 డాలర్లు)ను ఫెడరల్‌ ఆదాయ పన్ను( 25.9 శాతం)గా బైడెన్‌ దంపతులు చెల్లించారు.  అమెరికా ఉపాధ్యక్షురాలు కమలాహ్యారిస్, డౌగ్‌ ఎమ్‌హాఫ్‌ దంపతుల స్థూల ఆదాయం దాదాపు రూ.12.38 కోట్లు( 16,95,225 డాలర్లు) అని వైట్‌హౌస్‌ తెలిపింది. ఈ ఆదాయానికి 2020నాటి చట్టాల ప్రకారం దాదాపు రూ.4.54 కోట్లు(6,21,893 డాలర్లు) ఫెడరల్‌ ఆదాయ పన్ను(36.7 శాతం)గా హ్యారిస్‌ దంపతులు చెల్లించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement