పెళ్లి కుమార్తెను చూసి పడి పడి నవ్విన వరుడు

Best Man Dress As The Bride To Prank Groom Video Viral - Sakshi

నెట్టింట్లో వైరలవుతోన్న మ్యారేజ్‌ ప్రాంక్‌ వీడియో

వివాహం జరగబోయే ఇల్లు ఎంత సండిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బంధువుల హడావుడి, బావ మరదళ్ల సరసాలు.. మనవలు, మనవరాళ్ల అల్లరితో సరదగా సాగిపోతుంటుంది. ఇక పెళ్లింట్లో ప్రాంక్‌ చేస్తే ఆ మాజానే వేరు. జీవితాంతం ఆ సరదా సన్నివేశం అలా గుర్తుండిపోతుంది. తాజాగా ఈ కోవకు చెందిన వీడియో ఒకటి నెట్టింట్లో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన నెటిజనులు కడుపుబ్బ నవ్వించారు.. బెస్ట్‌ఫ్రెండ్‌కి.. బెస్ట్‌ గిఫ్ట్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

రఫి పినెడా రోజాస్‌ అనే యూజర్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ  వీడియోలో పెళ్లి కుమారుడు గోడవైపు తిరిగి వధువు కోసం ఆత్రుతగా ఎదురు చూస్తుంటాడు. ఇంతలో పెళ్లి దుస్తులు ధరించి.. అందంగా ముస్తాబైన వధువు అక్కడకు వస్తుంది. వెనక్కి తిరిగిన పెళ్లి కుమారుడు... వధువు మేలి ముసుగు తొలగించి.. ఆమె ముఖం చూసి ఒక్కసారిగా షాకవుతాడు. ఆ వెంటనే తేరుకుని పడి పడి నవ్వుతాడు.

అతడు అంతలా నవ్వడానికి కారణం ఏంటంటే పెళ్లి కుమార్తె గెటప్‌లో వచ్చింది అమ్మాయి కాదు.. అబ్బాయి. వరుడి బెస్ట్‌ ఫ్రెండ్‌ అతడిని ఆటపట్టించడం కోసం ఇలా పెళ్లి కుమార్తెలా తయారయి వచ్చి.. విజయవంతంగా ప్రాంక్‌ చేశాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. 

చదవండి: గడ్డకట్టే చలిలో.. బికినీ ధరించి బాల్కనీలో

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top