పులితో వాకింగ్‌.. ఏనుగు పిల్ల స్టెప్పులు | Baby Elephant dance In In South Africa | Sakshi
Sakshi News home page

పులితో వాకింగ్‌.. ఏనుగు పిల్ల స్టెప్పులు

Nov 15 2020 2:40 PM | Updated on Nov 15 2020 5:01 PM

Baby Elephant dance In In South Africa - Sakshi

సాధారణంగా చిన్న పిల్లలను బయటకు తీసుకెళ్తే వారి ఆనందం అంతా ఇంతా కాదు. ఇది మనుషులకే కాదు జంతువులకు వర్తిస్తుందని నిరూపించింది దక్షిణాఫ్రికాలోని క్రుగర్‌ నేషనల్‌ పార్క్‌కు చెందిన ఓ బుల్లి ఏనుగు. పార్క్‌ నిర్వాహకులు తల్లి ఏనుగుతో పాటు ఈ పిల్ల ఏనుగును ప్రదర్శనశాలకు తీసుకెళ్తుండగా.. ఆనందంతో రోడ్డుపై స్టెప్పులేసింది. లయబద్ధంగా కాళ్లు కదుపుతూ, తొండాన్ని ఆడించింది. ఈ దృశ్యాలు నెట్టింట వైరల్‌ కాగా, ఏనుగు పిల్ల డాన్స్‌లో మైకెల్‌ జాక్సన్‌నే మించిపోయిందని కామెంట్లు చేస్తున్నారు.


పులితో వాకింగ్‌..
వాయువ్య చైనాలోని ఘాన్సు వీధుల్లో ఓ పులి అందర్నీ ఆకర్షించింది. పెంపుడు జంతువును తీసుకెళ్తున్నట్లు ఓ వ్యక్తి పులిని వాకింగ్‌కు తీసుకెళ్లడం ఆకట్టుకుంది. అయితే.. ఆ పులిని చూసి ఎవరూ భయపడలేదు. ఎందుకంటే అది నిజంగా పులి కాదు. కాకేసియన్‌ షెపర్డ్‌ శునకం. కుక్కను పులిగా అలంకరించిన యజమాన్ని దాన్ని రోడ్లపై తిప్పుతున్న వీడియో నెట్టింట వైరలైంది.

Advertisement
 
Advertisement
Advertisement