అర్జెంటీనా చరిత్రాత్మక నిర్ణయం

Argentina Legalise Abortion - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : అబార్షన్లను చట్టబద్ధం చేస్తూ అర్జెంటీనా బుధవారం నాడు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రధాన దేశం అర్జెంటీనా. అబార్షన్లను అనుమతించవద్దని, అది శిశువుల జీవించే హక్కును హరించడమేనంటూ క్యాథలిక్‌ చర్చి వ్యతిరేకతను కాదని అర్జెంటీనా సెనేట్‌ 38–29 ఓట్ల తేడాతో అబార్షన్లను అనుమతించే చట్టాన్ని ఆమోదించింది. బ్యూనస్‌ ఏర్స్‌లో ఉన్న సెనేట్‌ భవనం ముందు నిరీక్షిస్తున్న వేలాది మంది ప్రజలు హర్షద్వానాలతో కొత్త చట్టానికి మద్దతు పలికారు. చట్టాన్ని వ్యతిరేకించిన వారు, బిల్లు ఆమోదం పట్ల కన్నీళ్లు కార్చిన వారు కూడా లేకపోలేదు. 

14 వారాల గర్భం వరకు మహిళలకు అబార్షన్లను అనుమతిస్తూ ఈ చట్టం తీసుకొచ్చారు. 2018లోనే ఈ చట్టం తీసుకొచ్చేందుకు విఫలయత్నం జరిగింది. నాడు ప్రవేశపెట్టిన బిల్లును దిగువ సభ ఆమోదించినప్పటికీ స్వల్ప ఓట్ల తేడాతో సెనేట్‌లో వీగిపోయింది. నేడు పాలకపక్షం అనుమతితో బిల్లు ఆమోదం పొందింది. 

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top