పాక్‌ ప్రధాని ఇంట్లోకి చొరబడ్డ అఫ్ఘాన్‌ వ్యక్తి.. భద్రతపై విమర్శల వెల్లువ | Sakshi
Sakshi News home page

పాక్‌ ‍ప్రధాని ఇంట్లోకి చొరబడ్డ వ్యక్తి..భద్రతపై విమర్శల వెల్లువ

Published Sun, Apr 9 2023 2:13 PM

Afghan Man Intrudes Into Pakistans PM House - Sakshi

పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ అధికారిక నివాసంలోకి ఓ వ్యక్తి చొరబడ్డాడు. ఎలా వచ్చాడో గానీ ప్రధాని ఇంట్లోకి చొరబడి భద్రతా ఉల్లంఘనలకు పాల్పడ్డాడు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అతన్ని అరెస్టు చేశారు. నిందితుడు అఫ్ఘాన్‌ వాసిగా పేర్కొన్నారు అధికారులు. అతను మూడు వేర్వేరు మార్గాల గుండా ‍ప్రధాని నివాసంలోకి చొరబడినట్లు తెలిపారు.

అందుకు సంబంధించిన సీసీఫుటేజ్‌లను కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అత్యంత భద్రతతో కూడిన ప్రధాని అధికారిక నివాసంలోకి ఎలా చొరబడ్డాడు అనేదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. నిందితుడిని విచారణ నిమిత్తం ఉగ్రవాద నిరోధక విభాగానికి అప్పగించినట్లు అధికారులు తెలిపారు.  

(చదవండి: గర్భంలో ఉండగానే కరోనా సోకిన పసికందులకు దెబ్బతిన్న మెదడు)

Advertisement
 
Advertisement