Afghan: అఫ్గన్‌ కేంద్రంగా దాడులు జరగనివ్వం

Afghan Foreign Minister Says Dont Allow Taliban Attacks - Sakshi

కాబూల్‌: అఫ్గాన్‌ను ఉగ్రశిబిరాలకు అడ్డాగా మారనివ్వబోమని తాలిబన్‌ నేతృత్వంలోని నూతన అఫ్గాన్‌ ప్రభుత్వంలోని విదేశాంగ మంత్రి మొలావీ ఆమిర్‌ ఖాన్‌ ముత్తఖి స్పష్టంచేశారు. తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడ్డాక ఆమిర్‌ ఖాన్‌ తొలిసారిగా పత్రికా సమావేశంలో మాట్లాడారు. తమ తాత్కాలిక తాలిబన్‌ ప్రభుత్వం ఎంతకాలం మనుగడలో ఉండనుందో, మైనారిటీలు, మహిళలకు ప్రాధాన్యత కల్పిస్తారో లేదో తదితర అంశాలపై ఆయన వివరణ ఇవ్వలేదు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఎన్నికలు నిర్వహిస్తారా అన్న ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు.

చదవండి: క్వారంటైన్‌లోకి పుతిన్‌ 

అఫ్గాన్‌ అంతర్గత వ్యవహారాల్లో ఇతర దేశాలు తలదూర్చాల్సిన అవసరం లేదన్నారు. అల్‌–ఖాయిదా తదితర ఉగ్రసంస్థలతో ఇకపై సంబంధాలను తెంచుకుంటా మని గత ఏడాది అమెరికాతో చర్చల సందర్భంగా తాలిబన్లు ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ మేరకు, అఫ్గాన్‌ గడ్డపై ఉగ్రసంస్థల కార్యకలాపాలను జరగనివ్వబోమని ఆమిర్‌ ఖాన్‌ స్పష్టంచేశారు. ఉగ్రసంస్థల పట్ల నూతన ప్రభుత్వం వ్యవహరించనున్న తీరుపై ఇలా ఒక కేబినెట్‌ మంత్రి మాట్లాడటం ఇదే తొలిసారి.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top