శ్రీలంక నేవీ అదుపులో మన జాలర్లు | 8 Indian fishermen arrested by Sri Lankan Navy for crossing maritime border | Sakshi
Sakshi News home page

శ్రీలంక నేవీ అదుపులో మన జాలర్లు

Jun 30 2025 6:02 AM | Updated on Jun 30 2025 6:02 AM

8 Indian fishermen arrested by Sri Lankan Navy for crossing maritime border

కొలంబో: శ్రీలంక నావికా దళం ఆదివారం ఎనిమిది మంది భారతీయ మత్స్యకారులను అరెస్ట్‌ చేయడంతోపాటు, వారి ట్రాలర్లను స్వాధీనం చేసుకుంది. మన్నార్‌కు ఉత్తర ప్రాంతంలో ఆదివారం ఉదయం తమ ప్రాదేశిక జలాల్లో అక్రమంగా చేపలు పడుతున్న భారతీయ మత్స్యకారులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు శ్రీలంక నేవీ తెలిపింది. భారత్, శ్రీలంకల నడుమ సంబంధాల్లో మత్స్యకారుల సమస్య వివాదాస్పదమైంది.

శ్రీలంక నేవీ పాక్‌ జలసంధిలో భారత మత్స్యకారులపై కాల్పులు జరపడం, తమ ప్రాదేశిక జలాల్లోకి అక్రమంగా ప్రవేశించారని అరెస్ట్‌లు చేయడం, వారి పడవలను స్వాధీనం చేసుకోవడం తరచూ జరుగుతున్నాయి. 

Advertisement
 
Advertisement
Advertisement