WHO Reports : 75% New Corona Cases Are Delta Variant - Sakshi
Sakshi News home page

మొత్తం కేసుల్లో 75% పైగా డెల్టా వేరియంట్‌వే 

Jul 23 2021 1:20 AM | Updated on Jul 23 2021 11:08 AM

75 Percent of New Covid19 Cases Are Delta Variant - Sakshi

జెనీవా: భారత్, చైనా, రష్యా, ఇజ్రాయెల్, యూకే సహా ప్రపంచవ్యాప్తంగా గత నాలుగు వారాలుగా పరీక్షించిన కోవిడ్‌–19 శాంపిళ్లలో పాజిటివ్‌గా తేలిన వాటిల్లో 75%పైగా డెల్టా వేరియంట్‌వేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. చాలా దేశాలు కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ కవరేజీని విస్తృతం చేసినప్పటికీ, ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ కేసుల్లో పెరుగుదల నమోదయిందని ఈనెల 20వ తేదీన విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.

గత వారంలో ఇండోనేసియాలో అత్యధికంగా 44% పెరుగుదలతో 3,50,273 కేసులు నమోదయ్యాయి. యూకేలో 41% పెరుగుదలతో 2,96,447 కేసులు, బ్రెజిల్‌ 14% పెరుగుదలతో 2,87,610 కొత్త కేసులు, భారత్‌లో 268,843 కొత్త కేసులతో 8 శాతం పెరుగుదల, అమెరికాలో 2,16,433 కొత్త కరోనా వైరస్‌ కేసులతో 68% పెరుగుదల నమోదైనట్లు వివరించింది.

జీఐఎస్‌ఎయిడ్‌ సంస్థ జూలై 20వ తేదీన వెల్లడించిన వివరాల ప్రకారం.. మొత్తం 2,40,000 శాంపిళ్లలో 2,20,000 శాంపిళ్లు డెల్టా వేరియంట్‌వేనని నిర్థారణ అయిందని తెలిపింది. రాబోయే నెలల్లో డెల్టా వేరియంట్‌ కేసులే అత్యధికంగా ఉండే అవకాశాలున్నాయని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. కాగా, భారత్‌లో నమోదవుతున్న కోవిడ్‌ కేసుల్లో అత్యధికం డెల్టా వేరియంట్‌వే ఉంటున్నాయని కరోనా జన్యుక్రమాన్ని శోధించే వేదిక ఇన్సాకాగ్‌ వెల్లడించింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement