15 మంది దుర్మరణం.. 400 మంది జాడలేదు

15 Dead, 400 Missing In Rohingya Camp Fire In Bangladesh: UN - Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌లోని ఒక రోహింగ్యా క్యాంపులో చెలరేగిన మంటల కారణంగా 15మంది దుర్మరణం చెందగా 400 మంది కనిపించకుండా పోయారు. దాదాపు 45వేలమంది నివాసముండే ఈ క్యాంపులో అగ్నిప్రమాదం కారణంగా 10వేలకుపైగా గృహాలు దగ్ధమయ్యాయని ఐరాస అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 15 మృతదేహాలను వెలికితీశారు. 560మంది గాయాలబారిన పడ్డారు. క్యాంపులో అధికశాతం షెల్టర్లు వెదురుతో నిర్మించినవి కావడంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందని యూఎన్‌ రెఫ్యూజీ ఏజెన్సీ ప్రతినిధి జొహన్నాస్‌ వాండీర్‌ క్లావూ చెప్పారు.

మంటల్లో నాలుగు ఆస్పుత్రులు, ఆరు హెల్త్‌ సెంటర్లు ధ్వంసమయ్యాయి. బర్మా నుంచి రోహింగ్యాల వలసలు ఆరంభమైనప్పటినుంచి ఇది అదిపెద్ద ప్రమాదమని బంగ్లా అధికారులు చెప్పారు. ఎంతమంది మరణించింది అధికారికంగా ప్రకటించలేదు. ప్రమాదంపై విచారణ జరుపుతున్నట్లు అధికారులు చెప్పారు. కాక్స్‌ బజార్‌లో దాదాపు 11 లక్షల మంది రోహింగ్యాలు వివిధ క్యాంపుల్లో ఆశ్రితులుగా ఉంటున్నారు. వీరిని బర్మా తరలించాలని భావించినా, ఆదేశంలో మిలటరీ పాలన రావ డంతో వీరి భవితవ్యంపై అయోమయం నెలకొంది. 

చదవండి: (అమెరికాలో మళ్లీ పేలిన తూటా.. 10 మంది మృతి)

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top