మన రుచి ‘దశ’దిశలా..
హైదరాబాదీ బిర్యానీకి పదో ర్యాంక్
సాక్షి, సిటీబ్యూరో: బిర్యానీ అనేది ప్రాంతాలకు అతీతంగా విస్తరించిన భోజన ప్రియుల అభి‘రుచి’. కోల్‌కతా బిర్యానీ, హైదరాబాదీ బిర్యానీ, లక్నోవి బిర్యానీ.. ఇలా వివిధ ప్రాంతాలకు వాటి సొంత ప్రత్యేకతలతో కూడిన బిర్యానీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగానూ, ప్రపంచవ్యాప్తంగానూ అందుబాటులో ఉన్నవాటిలో హైదరాబాదీ బిర్యానే అత్యుత్తమైందని మరోసారి నిరూపితమైంది. తాజాగా ఫుడ్ గైడ్ టేస్ట్ అట్లాస్ చేసిన జాబితాలో 50 ఉత్తమ బియ్యం వంటకాలు– 2025లో హైదరాబాద్ బిర్యానీ స్థానం సంపాదించింది. ప్రపంచవ్యాప్తంగా 10వ ఉత్తమ బియ్యం వంటకంగా ర్యాంక్ పొందింది.
జపాన్‌కి జై..
50 వంటకాల జాబితాలో జపాన్ స్పష్టమైన ఆధిపత్యాన్ని కనబర్చింది. మొదటి పది స్థానాల్లో నెగిటోరోడాన్ (1వ స్థానం), సుషి (2), కై సెండన్ (3), ఒటోరో నిగిరి (4), చుటోరో నిగిరి (7), నిగిరి (8), మాకి (9వ స్థానం)లో వరుసగా నిలిచి జపాన్ దేశ రుచికరమైన సముద్ర ఆహార వారసత్వ సత్తాని చాటాయి.


