హైదరాబాద్: జర్నలిస్టులపై కాంగ్రెస్ సర్కారు తీరు అనైతికమని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. నోటీసుల ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఓ వార్తకు సంబంధించి ఎన్టీవీకి చెందిన పలువురు జర్నలిస్టులను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేయడాన్ని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. విచారణ చేయకుండా చర్యలు తీసుకోవడం సరికాదని, జర్నలిస్టులను బెదిరించి భయపెట్టి చర్యలకు పాల్పడకూడదన్నారు. అరెస్ట్ చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేవారు కిషన్‌రెడ్డి
అర్థరాత్రి జర్నలిస్టుల అరెస్ట్ సరికాదు బండి సంజయ్
ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా అర్థరాత్రి జర్నలిస్టులను అరెస్ట్ చేయడం తగదన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాలన్నారు బండి సంజయ్
పోలీసుల తీరు సమర్థనీయం కాదు కొమ్మినేని
ఎన్టీవీకి చెందిన జర్నలిస్టులను అరెస్ట్ చేసే వ్యవహారంలో పోలీసుల తీరు సమర్థనీయం కాదన్నారు రాజకీయ విశ్లేషకులు కొమ్మినేని శ్రీనివాసరావు. సోదాల పేరుతో మీడియా సంస్థలన ఇబ్బంది పెట్టొద్దన్నారు కొమ్మినేని.
జర్నలిస్టుల అరెస్ట్‌ను ఖండిస్తున్నాం: పల్లా
జర్నలిస్టుల అరెస్ట్‌ను బీఆర్‌ఎస్ నేత పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఖండించారు. అర్థరాత్రి తలుపులు పగులగొట్టి జర్నలిస్టులన అరెస్ట్ చేయడం సరికాదన్నారు. కాంగ్రెస్ సర్కార చర్యలు ఎమెర్జెన్సీని తలపిస్తున్నాయని, అరెస్టు చేసిన జర్నలిస్టులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు పల్లా.


