త్వరలో ‘బస్తీ బాట – ప్రజాపాలన’
సాక్షి,సిటీ బ్యూరో : జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రజా సమస్యలు సత్వరమే పరిష్కరించే విధంగా త్వరలో ప్రత్యేక కార్యాచరణతో ‘బస్తీ బాట –ప్రజా పాలన’ కు సిద్ధమవుతున్నాం. ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అమలు చేసిన విధంగా అభివృద్ధి పనులు, సంక్షేమ ఫలాల సత్వర వర్తింపునకు క్షేత్ర స్థాయికి అధికార యంత్రాంగాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజా సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నాం’’ అని హైదరాబాద్ ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు. గురువారం ‘సాక్షి’తో ఆయన ప్రత్యేకంగా మాట్లాడారు.
సర్కారు ఏకై క ఎజెండా అభివృద్ది
మహా హైదరాబాద్‌గా నగరం విస్తరిస్తోంది. తాగునీటి సరఫరా, డ్రైనేజీ, రోడ్లు, మెట్రో కనెక్టివిటీ, ఎలివేటెడ్ కారిడార్లకు ప్రాధాన్యత ఇస్తున్నాం. రాబోయే 25 సంవత్సరాలలో పట్టణ జనాభా అవసరాలను పరిగణనలోకి తీసుకుని మౌలిక సదుపాయాల కల్పన కోసం అభివృద్ధి పనులు చేపడుతున్నాం. కుండపోత వర్షం వచ్చినా రోడ్లపై నీరు ఆగకుండా లాగిన్ పాయింట్లను ఏర్పాటు చేశాం. ప్రభుత్వం మెట్రో రైల్‌ను సైతం టెకోవర్ చేసుకొని రెండో, మూడో దశలను విస్తరించేందుకు చర్యలు చేపట్టాం. రాబోవు మూడేళ్లలో మరింత అభివృద్ధి చేస్తాం.
రాజకీయాలకతీతంగా అభివృద్ధి పనులు..
రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి పనులు చేపట్టలన్నదే ప్రభుత్వం లక్ష్యం. ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలి. తమ ప్రాంతాల సమస్యలు, అభివృద్ధి పనులను ప్రతిపాదనలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి. కొందరు ముందుకు వచ్చి సమస్యలు పరిష్కరించుకుంటున్నారు. మరి కొందరు పదేళ్ల మాదిరిగా అభివృద్ధి పనులకు దూరం పాటిస్తున్నారు. కేవలం రాజకీయ విమర్శలకు పరిమితమవుతున్నారు. ఇది మంచి పద్దతి కాదు.
త్వరలో ఇందిరమ్మ ఇళ్లు
నగరంలోని అర్హులందరికీ దశల వారిగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తాం. నగరంలో స్థలం కొరత కారణంగా కొంత అలస్యం జరుగుతోంది. గృహ నిర్మాణాల విధి విధానాల రూపకల్పన కోసం ఉన్నత స్థాయి కమిటీ కసరత్తు చేస్తోంది. అర్హులందరికి రేషన్ కార్డులు మంజూరు చేశాం.
కొత్త కాలనీలకు బస్సు సౌకర్యం
నగరంలో కొత్తగా వెలుస్తున్న కాలనీలు, శివార్లలోని విద్యాసంస్థల రూట్లలో ప్రజా రవాణా ఒత్తిడి ఉంటే ఆర్టీసీ సిటీ బస్సు సౌకర్యం కల్పిస్తాం, ఇప్పటికే ఆయా రూట్ల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఓఆర్‌ఆర్ పరిధిలో ఎలక్ట్రానిక్ బస్సులు అందుబాటులోకి తీసుకోస్తాం.
ప్రజల వద్దకు అధికారయంత్రాంగం
హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్


